బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయ్
ముంబై, మే 5
బంగారం ధర పడిపోయింది. వెలవెలబోయింది. కానీ వెండి ధర మాత్రం పైకి కదిలింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. బంగారం తగ్గితే.. వెండి మాత్రం పెరిగింది.బంగారం ధర దిగొచ్చింది. పసిడి వెలవెలబోయింది. బంగారం భారీగా దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల కారణంగా మన దేశంలోనూ పసిడి ధరపై ప్రతికూల ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో మంగళవారం పసిడి ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 700 తగ్గుదలతో రూ.44,560కు దిగొచ్చింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.710 తగ్గుదలతో రూ.46,300కు పతనమైంది. అయితే కేజీ వెండి ధర మాత్రం రూ.290 పెరిగింది. దీంతో ధర రూ.41,500కు చేరింది.కానీ హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.140 పెరుగుదలతో రూ.43,750కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.140 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.46,550కు ఎగసింది.పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.290 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.41,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.18 శాతం దిగొచ్చింది. దీంతో ధర ఔన్స్‌కు 1710.30 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.38 శాతం పెరుగుదలతో 14.85 డాలర్లకు చేరింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.