ఏపీలో కరెంట్ షాక్...
విజయవాడ, మే 5
రెండు నెలల సగటు విద్యుత్తు వినియోగం ఆధారంగా గ్రూప్ టారిఫ్ నిర్ణయించి విద్యుత్‌శాఖ బిల్లులు వసూలు చేస్తోంది. ఈ బిల్లుల దెబ్బకు జనాలకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ వినియోగదారులు మార్చి నెలలో వినియోగించిన యూనిట్లను ఏప్రిల్ నెల వినియోగంతో కలిపి మేలో విద్యుత్తు శాఖ బిల్లులను జారీ చేస్తోంది. లాక్‌డౌన్, కరోనా ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ బిల్లులపై పడింది. మార్చి, ఏప్రిల్ నెలల రీడింగ్ తీయలేని పరిస్థితి.. దీంతో ప్రభుత్వం ఆ రెండు నెలల సగటు విద్యుత్తు వినియోగం ఆధారంగా గ్రూప్ టారిఫ్ నిర్ణయించి విద్యుత్‌శాఖ బిల్లులు వసూలు చేస్తోంది. ఈ బిల్లుల దెబ్బకు జనాలకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ వినియోగదారులు మార్చి నెలలో వినియోగించిన యూనిట్లను ఏప్రిల్ నెల వినియోగంతో కలిపి మేలో విద్యుత్తు శాఖ బిల్లులను జారీ చేస్తోంది.ఈ బిల్లు ఆధారంగా డిస్కంలు మేలో విద్యుత్తు ఛార్జీలను వసూలు చేస్తున్నాయట. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండటం, అసలే ఎండాకాలం కావడంతో మార్చి. ఏప్రిల్ నెలల్లో విద్యుత్ వినియోగం పెరిగింది. దీనికి తోడు రెండు నెలల్లో వినియోగించిన మొత్తం యూనిట్లను కలిపి.. ఆపై వాటిని సగటు చేయడంతో కేటగిరి మారిపోయి బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. ఏప్రిల్‌లో విద్యుత్తు వినియోగం ఆధారంగా బిల్లులు తీసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని జనాలు అంటున్నారు.ఉదాహరణకు.. ఓ వినియోగదారుడికి మార్చి, ఏప్రిల్ నెలలకు కలిపి మేలో మీటర్ రీడింగ్ తీశారు. అతడు 581 యూనిట్ల ఉపయోగించాడని.. రూ.2542 బిల్లు వచ్చింది. ఇందులోంచి ఫిబ్రవరి విద్యుత్ వినియోగం ఆధారంగా చెల్లించిన రూ.450 మినహాయించి రూ.2082 చెల్లించాలని విద్యుత్తు శాఖ బిల్లు జారీ చేసింది. ఈయన బిల్లు కేటగిరీ కూడా మారింది. చాలామంది విద్యుత్ వినియోగదారులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది