YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ మౌనానికి కారణమేంటీ...

రేవంత్ మౌనానికి  కారణమేంటీ...

రేవంత్ మౌనానికి  కారణమేంటీ...
హైద్రాబాద్, మే 5
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పూర్తిగా పార్టీకి అందుబాటులో లేకుండా పోయారు. కరోనా సమయంలో లాక్ డౌన్ జరుగుతుందని భావించినా రేవంత్ మాత్రం పూర్తిగా మౌనంగా ఉండటానికి పార్టీ నేతలపై ఆగ్రహమే కారణమంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరింది కేసీఆర్ పై యుద్ధం చేయడానికే. టీడీపీ తెలంగాణలో బలహీనపడిపోయిందని గ్రహించిన రేవంత్ రెడ్డి గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరాలి.కాంగ్రెస్ లో చేరిన వెంటనే రేవంత్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. ఇది కొందరికి ఇష్టం లేకపోయినా అప్పట్లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మిన్నకుండి పోయారు. ఎన్నికల్లో రేవంత్ సయితం ఓటమి పాలయ్యారు. తర్వాత మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. రేవంత్ కు పార్టీలో ప్రయారిటీ దక్కుతుండటాన్ని కొందరు తట్టుకోలేక అధిష్టానానికి ఫిర్యాదులు వరసబెట్టి చేస్తున్నారు.ఇటీవల కాలంలో కేటీఆర్ ఫాం హౌన్ పై డ్రోన్ కెమెరాలను ఉపయోగించినందుకు ప్రభుత్వం కేసు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి జైలులో దాదాపు పక్షం రోజులు ఉన్నారు. కానీ ఏ కాంగ్రెస్ నేత కూడా ఆయనను పలుకరించిన పాపాన పోలేదు. ఒకరిద్దరు నేతలు మాత్రం జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చారు. పరామర్శించకపోగా రేవంత్ దే తప్పు అన్నట్లు మాట్లాడటం ఆయనను బాధించినట్లు తెలుస్తోంది. పార్టీ కోసమే తాను కేసీఆర్ తో విభేదిస్తున్నా కాంగ్రెస్ నేతలు తననే తప్పు పట్టడాన్ని రేవంత్ తట్టుకోలేకపోతున్నారు.వి.హనుమంతరావు, జగ్గారెడ్డి ఇలా వరసబెట్టి సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేశారని రేవంత్ రెడ్డి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. తాను మౌనంగా ఉండి ఉంటే తాను జైలుకు వెళ్లక పోయి ఉండేవాడినని, పార్టీ కోసం చేసినా తనదే తప్పు అని చిత్రీకరించడమేంటని రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. కాంగ్రెస్ లో తనకు పదవి రాకుండా చేసేందుకే కుట్ర జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన వెంటనే అధిష్టానానికి ఇక్కడ నేతలపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది.

Related Posts