భూపాలపల్లి పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. జిల్లా కేంద్రంలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేందుకే తాను బస్తి నిద్ర చేపట్టినట్టు శాసన సభ స్పీకర్ మధుసూధనా చారి అన్నారు.
శుక్రవారం రాత్రి జయశంకర్ భూపాల్ పల్లి కేంద్రం లోని శాంతినగర్ లో స్పీకర్ చేపట్టిన బస్తి ప్రగతి నిద్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. గ్రామస్తులు బతుకమ్మల తో స్పీకర్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ హైదరాబాద్ కు తీసిపోని విధంగా జిల్లా కేంద్రం పరిణామం చెందలనే సంకల్పం తో నా ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. .గతంలో మురికి కూపంగా ఉన్న పట్టణం 30 రకాల అభివృద్ధి పనులతో అభివృద్ది వైపు కొనసాగుతోందని అన్నారు. విద్యా, వైద్య పరంగా కాకుండా విద్యుత్ ను మెరుగు పరిచాను అని అన్నారు. బస్తి బాట సందర్బంగా ప్రజలు నగరం లో నీటి ఎద్దడి ఉందని నా దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. నీటి ఎద్దడి వెంటనే పరిష్కరించి ఈ వేసవిలో అందరికి తాగు నీరు అందేలా చర్యలు చేపడుతామని స్పీకర్ అన్నారు. భూపాలపల్లి ని ప్రగతి కాముఖ జిల్లా తీర్చి దిద్దడమే నా లక్ష్యం. ప్రజల సహకారం తో అభివృద్ధి చేస్తాను అని అయన అన్నారు.