టెలీమెడిసిన్ కు అద్భుత స్పందన
అమరావతి మే 5
టెలీమెడిసిన్ విజయవంతం చేయడంలో కలెక్టర్లది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన టెలీమెడిసిన్ కోసం ఒక నంబర్ ను కేటాయించినట్లు చెప్పారు. అలాగే ప్రతి సచివాలయంలోనూ ముఖ్యమైన ఫోన్ నంబర్లను ఉంచుతామన్నారు. ఈ నంబర్లు ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉండాలన్నారు. టెలీమెడిసిన్ కు అద్భుత స్పందన వస్తున్నదన్నారు. ఈ విషయంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. కాల్‌చేసిన వారికి ప్రిస్కిప్షన్ ఇచ్చిన తర్వాత ఆ వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితోపాటు, కలెక్టర్‌కూ వస్తాయనీ ఇక్కడే కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలపీ, పీహెచ్‌సీ పరిధిలోకి ఒక ద్విచక్ర వాహనాన్ని, థర్మల్ బాక్సును అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. అవసరమైన వారికి 24 గంటల్లోగా ప్రిస్కిప్షన్ ప్రకారం మందులు అందాల్సి ఉంటుందన్నారు. త్వరలో విలేజ్ క్లినిక్ ప్రారంభమౌతుందని చెప్పారు. అప్పుడు టెలీమెడిసిన్ మరింత బలోపేతమౌతుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలపై సమగ్రంగా సర్వే పూర్తయ్యిందనీ, సర్వే ప్రకారం అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పిన జగన్ ఇంకా 5281 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించుకున్న కంటైన్ మెంట్ క్లస్టర్లపై దృష్టిపెట్టాల్సి ఉందన్నారు. కంటైన్ మెంట్‌క్లస్టర్, దానిచుట్టూ ఉన్న బఫర్ జోన్‌పై పూర్తి దృష్టిపెట్టాలన్నారు. కొత్తగా వస్తున్న కరోనా కేసులలో అత్యధిక శాతం క్లస్టర్ జోన్ల నుంచే వస్తున్నాయని జగన్ వివరించారు.