వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే
జగిత్యాల మే 5
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లకు,పెన్షనర్లకు , పేదవయో వృద్ధులకు వారి ఇండ్లు వెళ్లి 116 మందికి హ్యాండ్ శానిటైజర్లు సంఘ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుంటే హ్యాండ్ హైజీన్ అనేది అతి తక్కువ ఖర్చులో మెరుగైన మార్గంగా నిలుస్తుందన్నారు.ఎలాంటి అంటువ్యాధునైనా శుభ్రత చాలావరకు కాపాడుతుందని, ప్రివెంటివ్ మెడిసిన్ లో అతి ముఖ్యమైనదని,హ్యాండ్ వాష్ ,రెస్పిరేటరీ మాత్రమే కాదు గ్యాస్ట్రో తదితర సమస్యలకు ఇది నివారణగా తోడ్పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయ్ , సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరి శెట్టి విశ్వనాథం , జగిత్యాల పట్టణ అధ్యక్షుడు అలిశెట్టి ఈశ్వరయ్య, కార్యదర్శి మానాల కిషన్, వెల్ముల ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.