ఏడు చువ్వలు లెక్క పెట్టిన జగన్ మోహన్ రెడ్డి టిడిపి పై అర్దరహిత అరోపణలు చేశారు. వైసీపీ ఎంపీలు చేసేవి దీక్ష లు కాదు మీ కేసులు గురించి చేసే భజనలని మాజీ మేయర్, టీడీపీ నేత పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. విజయసాయి వాడే రాక్షస భాష ఎవరు వాడరు. అఖిలపక్ష సమావేశం గురించి గతనెలలో ఉమ్మరెడ్డి వెంకటేశ్వర రావు శాసన మండలిలో అడగలేదా అని ప్రశ్నించారు. ఈ రోజు అఖిలపక్ష సమావేశం కు రామని ప్రకటన చేస్తే మీకున్న చిత్త శుద్ధి ఏమిటో కనపడుతుందని ఆమె అన్నారు. బిజెపి పార్టీ లో అద్వానీ కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. జగన్ మోహన్ రెడ్డి మాత్రం మోడీ పై ఒక్క మాట మాట్లాడరా అని నిలదీసారు. విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత లేదు. జగన్ ఒక దొంగ అయన పార్టీ లో కూడా దొంగ లే ఉన్నారు. ఏప్రిల్ లో పుట్టిన వారు దొంగ లు అయితే అ నెలలో పుట్డిన అంబేద్కర్ పై మీ చిత్తశుద్ధి ఏమిటని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి లాలూ చి పడి కాళ్ళుపట్టుకున్నారని ఆమె విమర్శించారు.