ఆశ వైద్య సిబ్బంది సేవలు మారువలేనివి
తెలంగాణ డైరీ డెవలప్ మెంట్ ఛైర్మన్ లోక భూమారెడ్డి
ఆదిలాబాద్ మే 05
కరోనావైరస్ నేపథ్యంలో ఆశ వర్కర్లు, వైద్య ఉద్యోగులు, సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివని తెలంగాణ డైరీ డెవలప్ మెంట్ ఛైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు.కరోనా వైరస్ నివారణలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని పుత్లిబొలి ప్రాథమిక వైద్య కేంద్రం లో కొరమండల్ పార్టీలైసర్ కంపెనీ అద్వర్యంలో మాస్కులు, గ్లౌజ్ లు వైద్య సిబందికి, ఆశ వర్కర్లకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన చైర్మన్ లోక భూమారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురిచేస్తుంది అన్నారు.దీని నివారణకు ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు.ప్రతి ఒక్కరు మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అయితే ముక్యంగా ఆశ వర్కర్లు,వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రజలు తమ పైసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.ఇందులో భాగంగా లోక భూమారెడ్డి ఎండలను దృష్టిలో ఉంచుకుని 1లీటర్ మంచి నీటి బాటిళ్లను అందజేశారు.ఇందులో నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, గోక భూమారెడ్డి, నారాయణ. డాక్టర్ వినోద్ కుమార్,బండారి కృష్ణ, వామన్ రావు,కొరమండ సేల్స్ మేనేజర్ సూర్యం,టి ఆర్ యస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.