YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కరోనా సమయంలో కూడా మద్యం అమ్మకాలు సమంజసమా ?

కరోనా సమయంలో కూడా మద్యం అమ్మకాలు సమంజసమా ?

కరోనా సమయంలో కూడా మద్యం అమ్మకాలు సమంజసమా ?
కర్నూలు
కరోనా రక్కసి కాలికి గజ్జెకట్టి కర్నూలు జిల్లాలో విలయ తాండవం చేస్తున్న విషయం ముఖ్యమంత్రి కి పట్టదా అంటూ మేధావి వర్గం ప్రశ్నిస్తోంది.ఇంకోవైపు ప్రధానమంత్రి సామాజిక దూరం పాటించండి, కరోనా ను పారద్రోలండి అంటూ పిలుపునిస్తూ కూడా మద్యం షాపులకు అనుమతించడం దారుణం. కేంద్ర ప్రభుత్వం అనుమతితో షాపులను తెరిచారా లేదంటే,రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకున్నదా అన్నది కోటి డాలర్ల ప్రశ్న గానే మిగిలిపోయింది.....అంతేకాక వైన్ షాపులకు అనుమతి ఇవ్వడంలో ఒక్కొక్క షాపు వద్ద వందలాది మంది గుమికూడి కరోనా రాక్షసి కి స్వాగతం పలికారు.ఒక్కసారిగా రాష్ట్రంలో వైన్ షాపులు తెరవడంతో 40 రోజుల పై చిలుకు పాటు నిర్వహించిన లాక్ డౌన్ నియమ నిబంధనలు బూడిదలో పోసిన పన్నీరులా అయ్యాయి.దీనితో జిల్లాలో ఇంకా ఎన్ని కేసులు నమోదు అవుతాయో వీరికి చికిత్స చేసిన డాక్టర్ లు ఎంతమంది కరోనాకు సమిధలు అవుతారో అంటూ మేధావి వర్గం తీవ్ర కలత చెందుతుంది. ఒకవైపు ఏమో మద్యం నిషేధం అమలు చేస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఢంకా బజాయించి చెబుతున్నారు.మరి వైన్ షాపులకు అనుమతి ఇచ్చి మద్యాన్ని ఏరులా ప్రవహింప చేస్తుంటే మరి మద్యం నిషేధం ఎలా అమలు అవుతుందో అంటూ మద్యనిషేధ కమిటీ మహిళలు మరియు ఐద్వా లాంటి మహిళా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నాయి.పేదింటి ఇళ్లలో తినడానికి తిండి లేని తరుణంలో ఎంత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారికి చేతనైనంత వరకు సహాయం చేశారు.దాతలు కొంతమంది స్వార్థంతో పావలా ఖర్చుపెట్టి, రూపాయి పబ్లిసిటీ పత్రికల ద్వారా పొందారు. దాతృత్వం అంటే అర్థం తెలియని మూర్ఖులు వీరు,కానీ వైన్ షాపులు మొత్తం గుమికూడిన పేదలను చూసి సహాయం చేసే దాతలు అందరూ వీరికా మనం సహాయం చేసిందంటూ మానసికంగా ఎంతో వేదన చెందారు. ఎందుకంటే మందు కొనడానికి డబ్బు ఉన్నవాళ్లకా మనం సహాయం చేసిందంటూ వారు ఆవేదన చెందారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మందిని రాజకీయ,మీడియా,ఆర్థిక సలహాదారుగా నియమించుకుని వారిలో కొందరికి క్యాబినెట్ హోదా కల్పించి ప్రభుత్వ ధనంతో జీతభత్యాలు చెల్లిస్తున్నారు.మరి అలాంటి సలహాదారులు ఈ కరోనా సమయంలోని విపత్కర పరిస్థితులలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయినప్పటికీ వైన్ షాపులు ఓపెన్ చేయమని సలహా ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ మహిళా సంఘాలు ముక్కున వేలేసుకున్నాయి.నిన్నటికి 25 శాతం అదనంగా మందు రేట్లు పెంచి అమ్మిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి,అయితే ఇప్పటికీ ఇప్పుడే ఖజానా నింపుకోవాలని తాపత్రయంలో మరో 50 శాతం రేట్లను పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు మందుబాబులు తెలిపారు. 75% పెంపుతో తాము మందు ఎలా కొనాలి అంటూ వీర త్రాగుడు మందుబాబులు ఆవేదన చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా మేధావి వర్గం ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాయి. మందు కు కూడా కూడా టోల్ఫ్రీ నెంబర్ను కేటాయించి ఇంటివద్దకే మందును సరఫరా చేయాలని,ఈ కార్యక్రమానికి వాలంటీర్లను,గ్రామ సచివాలయ సిబ్బందిని వినియోగించుకుంటే కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసిన వారు అవుతారని మేధావివర్గం చేతులెత్తి ప్రభుత్వానికి అభ్యర్థిస్తోంది.ఇక మందును ఇలాగే పెంచుకుంటూ పోతే మా ఇంట్లో ఉన్న నిత్యవసర వస్తువులను కూడా మా భర్తలు అమ్మి వేసి మందు తాగితే మా కుటుంబాల పరిస్థితి ఏమిటంటే పేద వర్గాల మహిళలు ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నిస్తున్నారు.ఇది ఇలా ఉండగా నానాటికీ మద్యం ధరలు మండిపోతున్నాయని వాటిని అందుకోవాలంటే రాకెట్లో ప్రయాణించ వలసి వస్తుందని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై తాగుబోతుల సంఘం నిరసన వ్యక్తం చేయబోతున్నట్లు తెలిసింది.మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ను కట్టడి చేస్తారో,లేక మందుకు అడ్డుకట్ట వేస్తారో అన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి.

Related Posts