వైకాపా చేపడుతున్న ప్రత్యేక హోదా ఉద్యమం విజయవంతం కావాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరుకున్నారు. శనివారం నాడు రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ లో వైకాపా రిలే దీక్ష శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. ఈ సంద్బంగా అయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని లీడ్ చేసే సువర్ణ అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులారా వదులుకున్నారని అన్నారు. వైకాపా ఎంపీ.ల రాజీనామాల తో ప్రత్యేక హోదా వేడి ఎన్నికల వరకూ కొనసాగుతుంది. కేంద్రం లో రాబోయే ప్రభుత్వంపై ప్రత్యేకహోదా ఇవ్వాలన్న ఒత్తిడి ఉంటుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.