YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

ధాన్యం తరుగుకు పాల్పడితే చర్యలు:

ధాన్యం తరుగుకు పాల్పడితే చర్యలు:

ధాన్యం తరుగుకు పాల్పడితే చర్యలు:
 అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలుధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో శుభ్రం చేసి అందిస్తున్నాం ధాన్యం కొనుగోలు పై రైస్ మిల్లు లతో సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్
పెద్డపల్లి  మే 5
ధాన్యం తరుగుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ రైస్ మిల్లర్ల ను హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు అంశంపై మంగళవారం సుల్తానాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో రైస్ మిల్ లతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. యాసంగి కాలంలో రైతులు  కోంతమంది 1153,1156,24423 విత్తనాలు వాడటం వల్ల ధాన్యం లో తెగులు అధికంగా వచ్చిందని, దీనిని కొనుగోలు కేంద్రాల వద్ద క్లీనర్ లను వినియోగిస్తూ శుభ్రం చేస్తున్నామని తెలిపారు. ధాన్యాన్ని శుభ్ర పరిచిన తర్వాత మాత్రమే రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నామని, అయినప్పటికీ కొంతమంది మిల్లర్లు రైతులను సంప్రదించి ధాన్యం తరుగు చేయడం  జరుగుతుందని,  ఇది పూర్తిగా ప్రభుత్వ లక్ష్యాలకు విరుద్ధమని అదనపు కలెక్టర్ అన్నారు.   దాన్యం కొనుగోలు కేంద్రాల్లో తెగులును పూర్తిస్థాయిలో నిర్మిస్తున్నామని అదనపు కలెక్టర్ తెలిపారు. రైస్ మిల్లులో కు తరలించిన ధాన్యంలో తెగులు ఉన్నట్లయితే సంబంధిత కొనుగోలు కేంద్రం ఇంచార్జ్  బాధ్యత వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో రైతులను సంప్రదించడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు.   ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు, తెగులు సమస్య పరిష్కరించేందుకు సమన్వయం చేసేందుకు 5 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని,ఉత్పన్నమయ్యే సమస్యలను వీరితో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. రైస్ మిల్లర్లకు సంయుక్తంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని,  రైస్ మిల్లర్లు వారి సమస్యలను ఆ బృందం తో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు.  సుల్తానాబాద్ డిప్యూటీ త
సిల్దార్ మహేష్ ఫోన్ నెంబర్ 753299989, మంథని ఫుడ్ ఇన్స్ పెక్టర్ షఫీ ఫోన్ నెంబర్ 9441128015, హుస్నాబాద్ నాయబ్ తహసిల్దార్  మల్లికార్జున్ రెడ్డి ఫోన్ నెంబర్ 9441267848 , గోలివాడ నాయక్ తహసిల్దార్ వేణు ఫోన్ నెంబర్ 9652663432 నెంబర్ల నందు రైస్ మిల్లులు సంప్రదించాలని అదనపు కలెక్టర్ సూచించారు.  జిల్లాలో పండిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ జరగాలని అధికారులను ఆయన ఆదేశించారు.       జిల్లా సహకార అధికారి చంద్రప్రకాష్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి తోట వెంకటేష్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్, సుల్తానాబాద్ తహసిల్దార్ హనుమంతరావు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు
 

Related Posts