YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

డేంజర్ లో దేశం.. సంచలన సీఎంఐఈ నివేదిక

డేంజర్ లో దేశం.. సంచలన సీఎంఐఈ నివేదిక

డేంజర్ లో దేశం.. సంచలన సీఎంఐఈ నివేదిక
న్యూ ఢిల్లీ మే 5
కరోనా వైరస్ కారణంగా భారత దేశంలో 10 కోట్ల నుంచి 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమని ప్రముఖ ఆర్థిక పరిశోధన సంస్థ సీఎంఐఈ అంచనా వేసింది. నిరుద్యోగిత శాతం ప్రస్తుతం 26-27శాతంగా ఉన్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. దేశంలో లాక్ డౌన్ విధించడంతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కోల్పోయారు. అసంఘటిత రంగాలకు చెందిన లక్షలాది మంది వలస కార్మికులు తమ గ్రామాలకు నడుచుకుంటూ వెళ్లిపోయారు. వ్యవసాయం బ్యాంకింగ్ ప్రజా పనుల మీద ఆంక్షలు సడలించినా రవాణా సేవలు వ్యాపారాలు అధికంగా మూతపడే ఉండడంతో పెద్ద ప్రయోజనం చేకూరలేదు. ఫలితంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సంక్షోభం మరింతగా విషమించిందని సీఎంఐఈ నివేదిక తెలిపింది.దేశంలో నిరుద్యోగిత రేటు మార్చిలో 8.7శాతం పెరిగినట్టు సీఎంఐఈ నివేదిక తెలిపింది. ఇది 43 నెలల్లోనే అత్యధికం అని పేర్కొంది. 2020మార్చి 24-31 మధ్య వారం రోజుల్లో ఏకంగా 23.8శాతానికి పెరిగిందని వివరించింది. దేశంలో దాదాపు 5 కోట్ల మంది కార్మికులు ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని గణాంక అధికారులు తెలిపారు.భారతదేశంలో 40కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర పేదరికంలో కూరుపోతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ ) సంచలన ప్రకటన చేసింది. నిరుద్యోగం పెరిగి సామాజిక అశాంతికి దారితీస్తుందని బాంబు పేల్చింది. దీంతో ఆర్థిక సంక్షోభం పేదల మీద పడకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

Related Posts