YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పళనికి కోయంబేడు టెన్షన్

పళనికి కోయంబేడు టెన్షన్

పళనికి కోయంబేడు టెన్షన్
చెన్నై, మే 6,
తమిళనాడును కరోనా వైరస్ వదలడం లేదు. ఈ ఒక్కరోజే 538 కేసులు నమోదయ్యాయి. ఇందులో చెన్నైలోనే 279 కేసులు నమోదు కావడంఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ తమిళనాడులో 33 మంది కరోనా కారణంగా మృతి చెందారు. మృతుల సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. ఇప్పటి వరకూ తమిళనాడులో 4 వేల కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క చెన్నైలోనే రెండు వేల కేసులు ఉండటం విశేషం.దీంతో పళనిస్వామి పనితీరుపై విపక్షాలు విమర్శలు దిగుతున్నాయి. సక్రమంగా వైరస్ పరీక్షలు నిర్వహించడం లేదని, కరనా వ్యాధి గ్రస్థులను గుర్తించడంలో కూడా తమిళనాడు ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ట్రేస్, టెస్ట్, ట్రీట్ ల విషయంలో తమిళనాడు సర్కార్ అట్టర్ ప్లాప్ అని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం కరోనా వైరస్ ను కట్టడి చేస్తున్నామని, పరీక్షలు ఎక్కువగా చేస్తుండ బట్టే కేసుల సంఖ్య పెరుగుతుంది.చెన్నై కొంప ముంచింది కోయంబేడు మార్కెట్. ఈ మార్కెట్ నుంచి కరోనా వ్యాప్తి ఎక్కువా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించారు. ఇక్కడ పనిచేసే వ్యాపారులు, హమాలీలకు కూడా కరోనా వైరస్ సోకింది. ఈ మార్కెట్ లోనే కరోనా వైరస్ 300 మందికి సోకడంతో ఇక్కడ పూర్తిగా వ్యాపారాలను మూసి వేయించారు. ఈ మార్కెట్ నుంచి వివిధ జిల్లాలకు 7,500 మంది వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ మార్కెట్ ను రెడ్ జోన్ లోకి తీసుకెళ్లారు.అయినా ఈ ఒక్కరోజే 538 కేసులు నమోదు కావడంతో పళనిస్వామి అప్రమత్తమయ్యారు. అధికారులతో అత్యవసర సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెన్నైలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం మీద తమిళనాడులో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజటివ్ కేసుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తుంది.

Related Posts