YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

బ్యాంకులలో కరోన మార్పులు

బ్యాంకులలో కరోన మార్పులు

బ్యాంకులలో కరోన మార్పులు
ముంబై, మే 6,
శవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా అన్ని వ్యాపారాలు మూతబడ్డాయి. నిత్యం ప్రజలతో అనుసంధానంగా ఉండే బ్యాంకులు కూడా అదే బాటలో వున్నాయి. తమ ఖాతాదారులు ఎవరినీ బ్యాంకులకు రావద్దని, కస్టమేర్ కేర్ సెంటర్లలోనూ తక్కువ సిబ్బంది వున్నారని మెసేజ్ లు పంపాయి. తాజాగా సోమవారం నుంచి అన్ని బ్యాంకులు 50 శాతం ఉద్యోగులతో యథావిధిగా పనిచేయనున్నాయి. దేశవ్యాప్తంగా ఈనెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగించగా, కొన్ని కర్మాగారాలు, దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. ‘కరోనా’ వైరస్‌ నిరోధక చర్యల్లో భాగంగా బ్యాంకులు తక్కువ సిబ్బందితో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిచేశాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి బ్యాంకులు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు యధావిధిగా పనిచేస్తాయని, 50 శాతం సిబ్బంది మాత్రమే విధులకు వినియోగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదే సమయంలో క్వారంటైన్‌ ప్రాంతాల్లో మాత్రం పనిచేయవని, ఆయా జిల్లాల యంత్రాంగం నివేదికల ఆధారంగా ఆ ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయడంపై త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు.ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు యథావిధిగా అందుబాటులో వుంటాయని ఏవైనా ఆధార్ అప్ డేట్, ఇతర అవసరమయిన సేవలు ప్రస్తుతం అందించడం లేదని బ్యాంకులు తెలిపాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ అన్ని రాష్ట్రాలను ఆదేశించారు. ఆదివారం ఢిల్లీ నుంచి ఆయన సీఎస్‌లు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్ డౌన్ వేళ ఏంచేయాలో నిర్దేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు కరోనా సాయం అందిస్తున్న నేపధ్యంలో ఆ నగదు బ్యాంకులలలోనే జమ అవుతుంది. ఇక ఈ సమయంలో ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు.ఇక మన తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ సాయం బ్యాంకులలో డిపాజిట్ కాగా ఆ డబ్బు కోసం జనాలు క్యూ కట్టారు. గుంపులు గుంపులుగా బ్యాంకులకు రావడంతో బ్యాంకు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. బ్యాంకుల్లో కరెన్సీ నోట్ల వల్ల కూడా కరోనా వస్తుందని వార్తలు రావడంతో కరెన్పీ నోట్లను చూస్తేనే ఉద్యోగులు వణికిపోతున్నారు. ఈ కారణంగానే కొంత మంది సిబ్బంధి విధులకు రావడానికే భయపడుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా బ్యాంకు నుంచి ఇంటికి వెళ్లేసరికి మానసిక ఒత్తిడికి గురవుతున్నామని బ్యాంక్ సిబ్బంది అంటున్నారు.

Related Posts