YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

గిట్టుబాటు ధర ల్లేక రైతులు విలవిల

గిట్టుబాటు ధర ల్లేక రైతులు విలవిల

గిట్టుబాటు ధర ల్లేక రైతులు విలవిల
హైద్రాబాద్,  మే 6
పండించిన పంటకు గిట్టుబాటుధర లేక  మామిడి రైతులు విలవిలలాడిపోతున్నారు.  ఏటేటా మామిడి రైతుకు గిట్టుబాటు ధర రాక నష్టాల్ని మిగుల్చుతుండడంతో దయనీయంగా మారింది. మంగు, తెగుళ్లు, వాతావరణంలో మార్పులు మామిడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. మామిడిపై రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. మద్దతు ధర లేకపోవడంతో పాటు ఢిల్లీ శేఠ్ల సిండికేటు మాయాజాలం మామిడి రైతుకు శాపంగా మారింది. ఉధ్యానవన పంటల్లో పామాయిల్‌, ఖోఖో, చెరుకు, కొబ్బరి, మొక్కజొన్న వంటి పంటలకు మద్దతు ధర ప్రకటించినట్లుగానే మామిడికి కూడా కనీస మద్దతు ధర నిర్ణయిస్తే కొంతవరకు నష్టాల నుంచి బయటపడే అవకాశాలున్నాయని పలువురు రైతులు భావిస్తున్నారు. పండ్లను ఎక్కువగా ఎగుమతి చేసే ఆలోచనతో తోటల్ని ఆశించిన తెగుళ్లను వదిలించుకోవడానికి విచక్షణ రహితంగా పురుగు మందులు వాడడంతో కాయల్లో నాణ్యత లోపించి ధర రాకుండపోతున్న విషయాన్ని రైతాంగం గమనించకపోవడం మరింత నష్టాలకు దారితీస్తుందన్న వాదన ఉధ్యానవన శాఖ శాస్త్రవేత్తలు, అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రతిఏటా మామిడిరైతులు తీవ్ర నష్టాలతో కుదేలవుతుండడంతో విసిగి తోటల్ని తొలగించి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్న పరిస్థితి నెలకొంది. వందల ఎకరాల్లో పంటలు పండినా గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్నారురైతులు. కొంతమంది మామిడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొంతమంది రైతులు ఉన్న ఆస్తులను అమ్మి అప్పులు తీర్చుకుంటున్నారు..ఆరుకాలం కష్టపడే రైతన్నకు చివరకు నిరాశే మిగులుతోంది. ఎంతో కష్టపడి మామిడి చెట్లను పెంచి కాపు వరకు తీసుకువస్తే గిట్టుబాట ధర లభించక రైతులు విలవిలలాడుతున్నారు. అప్పో, సొప్పో చేసి పంటలు పండించి లాభాలు గడిద్దామనుకుంటున్నరైతులకు అప్పులే మిగులుతున్నాయి.  మామిడికాయలు ఎగుమతిలో ఈ జిల్లానే ప్రథమం. విదేశాలకు కూడా  మామిడికాయలుఎగుమతి అవుతోంది. అయితే మధ్యలో దళారీలు రైతులను నిండి ముంచేస్తున్నారు. కమిషన్ల పేరుతోరైతులు పండించిన పంటలతో వేల రూపాయలు దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు. బెంగుళూరు మామిడి, బేనీశా మామిడికాయలకు కనీసం గిట్టుబాటు ధరలు ఇవ్వాలంటున్నారుమామిడి రైతులు. బెంగుళూరు మామిడి కాయిలకు కిలోకు 10నుంచి 15రూపాయలు, బేనీశా మామిడికికిలోకు 15 నుంచి 20లోపల ఇవ్వాలంటున్నారు రైతులు. తాము పూర్తిగా నష్టపోకముందే ప్రభుత్వం వెంటనే స్పందించాలంటున్నారు రైతులు.

Related Posts