YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మత్స్యకారులకు లబ్దీ

మత్స్యకారులకు లబ్దీ

మత్స్యకారులకు లబ్దీ
ఒంగోలు మే 6,
బుధవారం జరిగిన వై ఎస్ ఆర్ మత్స్యకార భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులను గత ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు గానే వాడుకుంది. మత్స్యకారులకు వై ఎస్ ఆర్ ప్రభుత్వం అండగా ఉంటూ ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో 12వేల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది వుంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఇచ్చిన మాటకోసం ముఖ్యమంత్రి మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకున్నారు. నేరుగా మత్స్యకారుల ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతుంది. కోవిడ్ 19 నియంత్రణ లో దేశానికే ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.
మద్యం పై ప్రతిపక్షాలు మాట్లాడటం సరైనది కాదు. గతం లో మద్యం ఏరులై పారింది. మా ప్రభుత్వం బెల్టు షాపులను పూర్తిగా తొలగించింది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ప్రజలు మెచ్చుకుంటున్నారని  మంత్రి సురేష్ అన్నారు.

Related Posts