YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమెరికాలో 72వేల పైగా చేరిన అమెరికాలో మరణాలు

అమెరికాలో 72వేల పైగా చేరిన అమెరికాలో మరణాలు
 
అమెరికాలో 72వేల పైగా చేరిన అమెరికాలో మరణాలు
   134000 మంది వైరస్ తో మరణిస్తారని ఒక అధ్యయనంలో అంచనా
           100000 మరణాలు కావఛూనన్న ట్రంప్
న్యూ ఢిల్లీ మే 6,
అమెరికాలో లాక్ డౌన్ ను పలు రాష్ట్రాలు ఎత్తివేయడంతో అమెరికాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కరనోనావైరస్ కేసులు మరియు మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.  చాలా రాష్ట్రాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి..వేల కేసులు.. వందల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ ఎత్తివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేశాయి. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 12.32 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా.. దాదాపు 72వేల మందికి పైగా మరణించారు.అమెరికాలోనే 134000 మంది వైరస్ తో మరణిస్తారని అమెరికాలోని ఒక అధ్యయనం అంచనా వేస్తుండగా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ ఇది దాదాపు 100000 మరణాలు కావచ్చని తెలిపారు.ఇప్పటికే అమెరికాలో  1.23 మిలియన్లకు పైగా కేసులు నమోదయ్యాయి 164000 రికవరీ అయ్యారు. 72000 మందికి పైగా మరణించారు. న్యూయార్క్లో మాత్రమే 319000 కన్నా ఎక్కువ కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నాటికి 19415 మంది మరణించారు. ఇక న్యూయార్క్ లోని నర్సింగ్ హోంలు వృద్ధాశ్రమాల్లో మార్చి 1 తర్వాత 4813 మంది కరోనాతో మృతి చెందారని అధికారులు తెలిపారు. గతంలో లెక్కచూపని 1700కు పైగా మరణాలు ప్రస్తుతం కరోనా చావులుగా నిర్ధారించారు. దీంతో ఒక్క న్యూయార్క్ లోనే వచ్చే నెల 1 నాటికి రెండు లక్షలకు కేసులు పెరిగాయి. మరణాలు 3వేలు అదనంగా పెరిగాయని అమెరికా నివేదిక బయటపెట్టింది.లాక్ డౌన్ ఎత్తివేత.. అన్ని వైపుల నుండి కేసుల సంఖ్య పెరుగుతోంది. సడలింపులు పెద్ద విపత్తును కలిగిస్తాయి. సాంఘిక దూరం మరియు ఇంటి మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు పాటించలేనందున వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. కాగా కరోనా నివారణకు  ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు సాగుతున్నాయి. 108 సంభావ్య వ్యాక్సిన్లు పరిశోధిస్తున్నారు. వాటిలో 8 క్లినికల్ ట్రయల్స్ కోసం ఆమోదించబడ్డాయి.

Related Posts