మొత్తం కౌన్సెలింగ్ పక్రియ ఆన్లైన్లోనే
- నవీన్ మిత్తల్
హైదరాబాద్ మే 6
ఎంసెట్ ఇతర ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలంగాణ సాంకేతిక, కళాశాల విద్యాశాఖల కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. కరోనా ప్రస్తుతం ఇబ్బందులు పెడుతున్నా... దీర్ఘకాలికంగా అనేక మంచి పరిణామాలకు అవకాశం ఇస్తుందని నవీన్ మిత్తల్ చెప్పారు