YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

విదేశాలనుంచి వారికోసం సమీక్ష

విదేశాలనుంచి వారికోసం సమీక్ష

విదేశాలనుంచి వారికోసం సమీక్ష
హైదరాబాద్ మే 6
లాక్ డౌన్ కారణంగా విదేశాలలో నిలిచిపోయిన భారత పౌరులు ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్ కు వస్తున్నందున చేయవలసిన ఏర్పాట్ల పై బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విదేశాలలో నిలిచి పోయిన భారతీయ పౌరుల తరలింపుకు సంబంధించి ఉత్తర్వులు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకోల్  జారీ చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఆరు దేశాల నుండి 7 ప్రత్యేక విమానాల ద్వారా దాదాపు 2350 మంది ప్రయాణీకులు రానున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. వీరికి అవసరమైన సంస్థపరమైన క్వారంటైన్, ఎయిర్ పోర్ట్ లో మెడికల్ స్క్రీనింగ్ , కేంద్ర నోడల్ అధికారులతో సమన్వయం తదితర ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. కేంద్ర నిబందనల ప్రకారం విదేశాల నుండి వచ్చే ప్రయణీకులు సంస్థపరమైన క్వారంటైన్ కు తమ స్వంత ఖర్చు తో వెళ్లవలసి ఉంటుందని తెలిపారు. ప్రయణీకుల 14 రోజుల వసతికి సంబంధించి హోటళ్లతో సమన్వయం చేసుకొని ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ చెక్ అప్ లను రెగులర్ గా నిర్వహించడానికి ప్రత్యేక మెడికల్ టీమ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్ పోర్ట్ నుండి క్యారంటైన్ సెంటర్లకు ప్రయణీకులను తరలించే బాధ్యతను ఆర్.టి.సి యం.డి. కి అప్పగించారు. ఈ సమావేశంలో  వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, వికాస్ రాజ్ , పోలీస్ శాఖ అదనపు డి.జి. జితేందర్ , కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, రాహుల్ బొజ్జా,  జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్ , సైబారాబాద్ పోలీస్ కమీషనర్  సజ్జనార్, గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ నీతూ ప్రసాద్ , ప్రోటో కాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ , ఎయిర్ పోర్ట్  ఇమ్మిగ్రేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts