YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కష్టాన్ని , కడలిని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు " వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకం

కష్టాన్ని , కడలిని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు "   వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకం

కష్టాన్ని , కడలిని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు  
  "   వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకం "                                                
 --- మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం మే 6
 ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి జగన్మోహనరెడ్డి జనరంజకంగా పాలన చేస్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరు పట్ల ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  ప్రస్తుత  ప్రభుత్వం ఆ దిశలో మరో ముందడుగు వేసింది. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే పరిహారాన్ని రూ.10 వేలకు పెంచడంతో పాటు, గత ఏడాది మత్స్యకార దినోత్సవం రోజు ఆ మొత్తం చెల్లించగా, ఈసారి మే నెలలోనే వారికి ఆర్థిక సహాయం చేస్తోంది. లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు నేడు ( బుధవారం ) రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది.   గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే ఈ సహాయం చేయడం ఒక సంచలనమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. కాగా, దేశమంతా లాక్‌డౌన్‌ పరిస్థితి నేపథ్యంలో, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నా,  కష్టాన్ని , కడలిని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటూ, వారికి ఆర్థికంగా భరోసా ఇస్తూ, వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రభుత్వం క్రాప హాలిడే సమయంలో అమలు చేయడం అత్యంత సాహసోపేతమైన చర్య అని మంత్రి పేర్ని నాని అన్నారు.    సముద్రంలో చేపల వేటను ఈ ఏడాది ఏప్రిల్  నెల 15 నుండి జూన్ 14వ తేది వరకు 61 రోజులపాటు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ (జిఓఆర్టి నెం .80, పశు సంవర్దక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ, తేది 26.3.2020)  జారీ చేసింది. అయితే , సాంప్రదాయ బోటులకు (ఇంజను లేని పడవలకు) ఈ నిషేధ కాలం వర్తించదు. సముద్రంలో చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరంక్షించుటమే కాక  వాటి ఉత్పత్తిని పెంచుట తద్వారా మత్స్య సంపద అభివృద్ది సాధించుట ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది.  ప్రతి సంవత్సరం ఈ వేట నిషేధ కాలాన్ని పాటించడం జరుగుతుంది. ఈ నిషేధ ఉత్తర్వులను అనుసరించి మెకనైజడ్, మోటరైజడ్ బోట్లు వినియోగించి సముద్ర జలాలలో చేపల వేట జరిపరు . అంతేకాక వేట నిషేద ఉత్తర్వులు ఉల్లంఘించిన బోటు యజమానులపై ఎపిఎంఎఫ్ఆర్ చట్టం 1994 ప్రకారం చర్య తీసుకోనుండటంతో  బోటుయజమానులందరూ ఈ నిషేధ ఉత్తర్వులు తప్పనిసరిగా అమలుచేస్తున్నారు.  చేపల వేట నిషేధం కాలం ఎందరో మత్స్య కార్మికులకు ఎంతో  గడ్డు కాలంగా ఉండేది. సముద్రంలో చేపల వేట లేకపోవడంతో పలువురు అప్పుల వలలో చిక్కుకొనేవారు. పెట్టుబడుల కోసం వడ్డీ మారాజులను ఆశ్రయించేవారు.   కృష్ణాజిల్లాలో సముద్ర తీర నిడివి 111 కిలోమీటర్లు , 4 తీర ప్రాంత మండలాలు ఇందులో  మత్య్స కార గ్రామాలు 64 ఉన్నాయి. మత్స్య కారుల జనాభా 1 లక్షా 12 వేల 977 ఉంటే ఇందులో క్రియాశీలక మత్స్య కారుల సంఖ్య 38, 914  మంది ఉన్నారు. ఒకప్పుడు ఒక్క సామాజిక వర్గానికే పరిమితమైనా ప్రస్తుతం ఈ వృత్తినే అందరూ నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లాలో  అర్హులైన లబ్ధిదారులు  9, 192 మంది ఉన్నారు.  ఇందులో దళితుల, బలహీన వర్గాల వారే అత్యధికంగా ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షభావాల వల్ల గడిచిన ఆరేళ్లలో జిల్లాలోని మత్స్య కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. చేసిన అప్పులు తీర్చలేక, వృత్తిని వదులుకోలేక కాలం నిస్తేజంగా వెళ్లబుచ్చుతున్నారు.    గత ఏడాది నవంబరు 21న మత్స్యకార దినోత్సవం రోజున ఆ సహాయం అందించగా, ఈసారి 6 నెలల ముందుగానే, బుధవారం లక్షకు పైగా మత్స్యకార కుటుంబాల బ్యాంక్‌ ఖాతాల్లోకే నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.10 వేల చొప్పున జమ చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదని మంత్రి పేర్ని నాని వాఖ్యానించారు. మత్స్యకారులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. చేపల వేట కోసం మత్స్యకారులు వినియోగించే పడవలకు 2019 వరకు లీటరు డీజిల్‌పై రూ.6.03 గా ఉన్న సబ్సిడీని రూ.9 కి పెంచడంతో పాటు, ఆ రాయితీ తక్షణమే అందించడం ద్వారా  ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పేద మత్స్య కార్మిక కుటుంబాల పట్ల ఉన్న మానవతా దృష్టి , చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుందని మంత్రి పేర్ని నాని వివరించారు.
 

 

Related Posts