YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ముంబాయి వలస కార్మికులను రిసీవ్ చేసుకుని క్వారంటైన్ కేంద్రాలకు పంపిన జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ లు

ముంబాయి వలస కార్మికులను రిసీవ్ చేసుకుని క్వారంటైన్ కేంద్రాలకు పంపిన జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ లు

ముంబాయి వలస కార్మికులను రిసీవ్ చేసుకుని క్వారంటైన్ కేంద్రాలకు పంపిన జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ లు
గుంతకల్లు మే 6
ముంబాయి నుండి స్పెషల్ ట్రైన్ లో జిల్లాలోని గుంతకల్లుకు చేరుకున్న 968 మంది  ముంబాయి వలస కార్మికులను జిల్లా ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు, జాయింట్ కలెక్టర్ రామమూర్తిలు రిసీవ్ చేసుకుని సురక్షిత చర్యలు అనంతరం క్వారంటైన్ కేంద్రాలకు  పంపారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని జాగ్రత్థలు తీసుకున్నారు. మహరాష్ట్రలోని థానే రైల్వే స్టేషన్ నుండి 968 మంది వలస కార్మికులతో స్పెషల్ ట్రైన్ నిన్న రాత్రి బయలుదేరి జిల్లాలోని గుంతకల్లు హనుమాన్ జంక్షన్ కు ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో వచ్చింది. ఈ ట్రైన్ లో మన జిల్లాలోని విడపనకల్లు కొత్తకోట, కరకముక్కల, హావళిగి, పాల్తూరు ప్రాంతాలకు చెందిన వారు 650 మంది...  కర్నూలు జిల్లా సంగాల, నగరడోన, చిప్పిగిరి, జవహార్ పేట లకు చెందిన 251 మంది... మిగితా వారు బళ్లారికి చెందిన 67 మంది వలస కార్మికులు. మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చర్చించాక అధికారికంగా వీరిని స్పెషల్ ట్రైన్ ద్వారా ఇక్కడికి పంపారు. ఈ వలస కార్మికులను జాయింట్ కలెక్టర్ -2 రామమూర్తితో కలసి జిల్లా ఎస్పీ రిసీవ్ చేసుకున్నారు. రైలు బోగిల నుండి వీరు దిగి  బయటికొచ్చే సమయంలో బందోబస్తు మరియు ఇతర విధుల్లో ఉన్న సిబ్బందికి ఫిజికల్ కాంటాక్టులోకి రాకుండా ఉండేలా వీరికోసం ప్లాట్ ఫాంపై రోప్ ద్వారా ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ఒక బోగిలో వారిని దింపి వీరికి మాస్కులు ధరింపజేసి వైద్య సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ చేశారు. ఇలా... ఒక బోగిలోని వారికి సురక్షిత చర్యలు పూర్తీ అయ్యాక మరొక బోగిలోని వలస కార్మికులను దింపారు. ఈసందర్భంగా బందోబస్తు, ఇతర విధుల్లో ఉన్న సిబ్బంది పి.పి.ఇ కిట్లు ధరించి వలస కార్మికులు సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం క్వారంటైన్ కేంద్రాలకు పంపేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో వీరిని ఎక్కించారు. సామాజిక దూరం పాటిస్తూ సీట్లలో కూర్చోబెట్టి పి.పి.ఇ కిట్లు ధరించిన డ్రైవర్లచే బస్సులను ఆయా క్వారంటైన్ కేంద్రాలకు పంపారు. ఉరవకొండ ఢిగ్రీ కళాశాల క్వారంటైన్ కేంద్రానికి 50 మందిని, బాలయోగి రెసిడెన్సియల్ క్వారంటైన్ కు 100 మందిని, ఏ.పి మోడల్ పాఠశాల చిన్నముష్టూరు క్వారంటైన్ కేంద్రానికి 150 మందిని, కె.జి.బి.వి విడపనకల్లుకు 110 మందిని, మోడల్ పాఠశాల విడపనకల్లుకు 140 మంది, గుంతకల్లు ఎస్ వి ఐ ఎస్ క్వారంటైన్ కేంద్రానికి 100 మందిని... మిగితా వారిని కర్నూలు, బళ్లారి జిల్లాల క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ -2 లతో పాటు గుంతకల్లు డీఎస్పీ ఖాసీం సాహెబ్ , గుంతకల్లు మున్సిపల్ కమీషనర్ శేషన్న, గుంతకల్లు సబ్ డివిజన్ సి.ఐ లు ఉమామహేశ్వరరెడ్డి, చిన్న గోవిందు, రాము, వెంకటేశ్వర్లు, సబ్ డివిజన్ ఎస్సైలు, వైద్య మరియు రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related Posts