YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తాగుబోతులను దూరం పెట్టండి

తాగుబోతులను దూరం పెట్టండి

తాగుబోతులను దూరం పెట్టండి
బిజెపి మద్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి
నెల్లూరు మే 6
కరోనా వైరస్ మహమ్మారి కరువు నేపథ్యంలో పూర్తిస్థాయిలో పేదరిక అనుభవిస్తూ, ఆకలితో అలమటిస్తున్న వారిని మాత్రమే గుర్తించి, వారికి అన్నదానం చేయాల్సిన అవసరం ఉందని, పేదరికం ముసుగులో తాగుబోతులుగా తయారైన వాళ్లను దూరంగా పెట్టాలని భారతీయ జనతా పార్టీ మద్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బండారు సురేష్ నాయుడు పేర్కొన్నారు. ప్రజాహితం కోరి, ప్రజా శ్రేయస్సు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో అమలవుతున్న లాక్ డౌన్ సమయంలో యాచకులు, వృద్ధులు, వికలాంగులకు మాత్రమే తన వంతు సేవా సహాయ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు దాతృత్వం గల దాతలు ముందుకు వచ్చి, నెల్లూరు నగర గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద ప్రజలకు బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 42 రోజుల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న గొంతు తడి అనే కార్యక్రమాన్ని అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్యాయమన్నారు. ఈ వ్యాపారంలో భాగంగా తొలుత సోమవారం 25 శాతం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, మంగళవారం 75% పెంచినప్పటికీ మద్యం వ్యసనపరులు తమ అవసరానికి మించి అప్పు చేసి మరీ, మద్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటువంటి ఆపత్కాల ఈ పరిస్థితుల్లో కూడా 150 రూపాయలు విలువచేసే క్వార్టర్ బాటిల్ ను 500 వెచ్చించి మరీ కొనుగోలు చేయడం జరుగుతుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి, మద్యం కొనుగోలుదారులకు, వారి చేతి వేళ్లపై చెరగని ఇంకు ముద్ర  బాగుంటుందని సూచించారు. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇకనైనా, అర్హత కలిగిన వారికి మాత్రమే అన్నదాన కార్యక్రమాలను చేయవలసిందిగా పిలుపునిచ్చారు.

Related Posts