YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

విజృంభిస్తున్న వేడిమి

 విజృంభిస్తున్న వేడిమి

భానుడి ప్రతాపం రోజురోజుకు పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో జనాలు అల్లాడిపోతున్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉన్నా ఎండ విజృంభించడం ఖాయం. ఇప్పటికే పలువురు ఎండల ప్రభావంతో వడదెబ్బకు గురయ్యారు. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. మంచిర్యాల జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. ఉక్కపోత కూడా అధికంగానే ఉంది. ఉదయం 8 గంటలకే వేడిమి ఉంటోంది. ఇక 9 దాటితే బయటికి వెళ్లేందుకు జనాలు భయపడుతున్నారు. రోడ్లు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. మధ్యాహ్నమైతే రహదారులు దాదాపు నిర్మానుష్యంగానే ఉంటున్నాయి. ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. అత్యవసరమైన పనులు ఉంటేనే బయటకు వస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో పాటూ సాగు నీటి అవసరాలూ పెరగడంతో జిల్లాలో విద్యుత్ వినియోగం పెరిగింది. ఇదిలాఉంటే కొన్ని సంవత్సరాలుగా వేసవి తీరుతెన్నులు మారిపోతున్నాయి. కాలుష్యం, ఓజోన్ పొర దెబ్బతినడంతో ప్రజారోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. 

 

సూర్యుడి అతినీలలోహిత కిరణాలు సరాసరి భూమిని చేరుతుండడం ప్రమాదకంగా మారుతోంది. జీవరాశి ప్రభావితమవుతోంది. వేసవిలో ఈ ఎఫెక్ట్ అధికంగా ఉంటోంది. అందుకే ఎండలో తిరిగే వారే కాకుండా ఇళ్లల్లో ఉంటున్నవారూ పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. మంచినీళ్లతో పాటూ కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ లాంటి ద్రావణాలు సేవిస్తుండాలని సూచిస్తున్నారు. ఎండలోకి వస్తే రక్షణ చర్యలు తప్పని సరిగా తీసుకోవాలని, గొడుగులు లేదా ముసుగులు వేసుకునే బయటకు రావాలని తేల్చిచెప్తున్నారు. ఈ సీజన్‌లో టీ, కాఫీలకు దూరంగా ఉంటేనే మేలు. ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణాలు మంచిదికాదు. ఎండలో పని చేసే కార్మికులు, కర్షకులు గంట గంటకు 15 నిమిషాలైనా నీడలో కూర్చోవాలి. శుభకార్యాలు లేదా టూర్ల నిమిత్తం దూర ప్రయాణించే వారు విధిగా ఓఆర్‌ఎస్‌ పొట్లాలు దగ్గర ఉంచుకోవాలి. వేసవిలో ప్రజలు వడదెబ్బ నుంచి రక్షించే పదార్ధాలు ఎక్కువగా సేవించాలని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ కాలంలో దొరికే పండ్లరసాలు సేవిస్తే ఉష్ణతాపం నుంచి బయటపడొచ్చని చెప్తున్నారు. 

Related Posts