గల్ఫ్ లో 3 లక్షల మంది ఎదురు చూపులు
న్యూ ఢిల్లీ మే 6
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న దాదాపు 10 వేల మంది భారతీయులకు కరోనా సోకినట్టు సమాచారం. మహమ్మారి కారణంగా ఇప్పటికే 84 మంది భారతీయులు మరణించారు. ఆ దేశంలో విధించిన ఆంక్షల కారణంగా పనులు లేక ఎంతో మంది భారతీయ కూలీలు తీవ్రమైన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు వైరస్ సోకిన వారిని నిర్బంధించిన కేంద్రాల్లో అక్కడి ప్రభుత్వాలు సరైన వసతుల్ని కూడా కల్పించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆందోళనకు గురైన వలస కార్మికులు.. తమకు కొవిడ్-19 సోకుతుందేమోనని భయపడుతున్నారు. ఈ క్రమంలో దాదాపు మూడు లక్షలమంది భారతీయులు స్వదేశానికి రావడానికి పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే కేంద్రం 14,800 మందినే తరలిస్తామని చెప్పడంతో తమ పరిస్థితేంటని.. గల్ఫ్‌లోని వేలాది మంది కూలీలు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. తమను కూడా తీసుకుపోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.