తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం ధరలు
హైద్రాబాద్, మే 6,
మార్చి 22 తర్వాత తెలంగాణలో మద్యం దుకాణాలు తెరుచుకున్న వేళ కేసీఆర్ సర్కారు మద్యం ధరలను పెంచింది. చీప్ లిక్కర్ ధరలను 11 శాతం పెంచిన ప్రభుత్వం.. మిగతా మద్యం ధరలను 16 శాతం వరకు పెంచింది. చీప్ లిక్కర్ ఫుల్ బాటిల్‌పై రూ.40 పెంచిన సర్కారు.. ఆర్డినరీ లిక్కర్ ఫుల్ బాటిల్ ధరను రూ. 80, స్కాచ్ లిక్కర్ ధరను రూ.160 వరకు పెంచింది. బీరు ధరలను రూ.30 పెంచింది.చాలా రోజుల విరామం తర్వాత మద్యం దుకాణాలను తెరుస్తుండటంతో మందుబాబులు ఉదయం నుంచే క్యూ కట్టారు. కొన్ని చోట్ల సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ.. మాస్కులను ధరించి బుద్ధిగా లైన్లో నిలబడ్డారు. మరికొన్ని చోట్ల మాత్రం మద్యం కోసం ఎగబడ్డారు. ఎండ వేడిమి తట్టుకోలేక మందుబాబులు బ్యాగులు, చెప్పులను క్యూలో ఉంచి తమ వంతు రాగానే మద్యం కొనుగోలు చేస్తున్నారు.కొంత మంది తమ దగ్గర డబ్బులు లేనప్పటికీ.. మిత్రుల దగ్గర అప్పు తెచ్చుకొని మరీ మద్యం కొనుగోలు చేస్తున్నామని చెబుతుండటం గమనార్హం.