విశాఖపట్నం
నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా 3 కిలోమీటర్ల మేర కెమికల్ గ్యాస్ వ్యాపించింది. ఈ రసాయన వాసనకు కళ్లు మండి కడుపులో వికారంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో కొంతమంది స్థానికులు అవస్థలు పడుతూ సృహ తప్పి పడిపోయారు. కొంతమంది ప్రజలు మేఘాద్రి గెడ్డ వైపు పరుగులు తీసారు. మరికొంత మంది సిబహాచలం వైపు పరుగులు తీసారు. మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున సంభవించినట్లు అధికారులు గుర్తించారు.
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ హుటాహుటిన స్థలికి చేరుకున్నారు. పరిస్థితి అదుపులోకి రావడానికి మరో 2 గంటలు పట్టొచ్చని వెల్లడించారు. సుమారు 200 మంది అస్వస్థతకు గురైఉంటారుని ఆయన తెలిపారు. యంత్రాలను ప్రారంభించే సమయంలో మంటలు వచ్చాయని వెల్లడించారు.