ఏలూరు,
కృష్ణకాలువ నీరు చౌర్యానికి పాల్పడుతున్నారు. వేసవి ముందే కృష్ణకాలువకు నీటిని నిలుపుదల చేశారు. అనంతరం ఆ కాలువలో కొద్దిమేర నీరు నిల్వ ఉంది. అసలే వేసవి ఆపై నీటి కొరత.. ఈ నేపథ్యంలో చుక్కనీరు కనిపించినా వదిలే పరిస్థితి ఉండదు. ఇదే పరిస్థితి ఏలూరులో భవన నిర్మాణదారులకు, ఇతర అభివృద్ధి కార్యమాలు చేపడుతున్న వారికి తలెత్తింది. నగరంలో ఎటుచూసినా ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని, ప్రధాన సెంటర్లలో కూడా ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నారని, ఇటువంటి పరిస్థితిని తొలగించి భావితరాల కోసం ఏలూరు కృష్ణాకాలువ గట్టు ప్రాంతాన్ని ఆహ్లాదకరవాతావరణంలో ఆధునిక విధానంలో సుందరీకరణ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆక్రమణల తొలగింపు వల్ల నష్టపోయిన బాధితులకు ప్రత్యామ్నాయ రోడ్డును ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో విశాలమైన రహదారరి వ్యవస్థను నెలకొల్పుతామని, దీని వవల్ల ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నగర అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు, పారిశ్రామికవేత్తలు భాగస్వవాములు కావాలని ప్రజాసహకారం ఉంటే త్వరలోనే కృష్ణకాలువకు ఇరువైపులా పచ్చని వనాలు, జాతీయ నాయకుల విగ్రహాలతో నూతన శోభను చేకూరునుంది, ఏలూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా కృష్ణకాలువ గట్టులను సుందరీకరిస్తామని బడేటి బుజ్జి చెప్పారుఏలూరు నగరంలోని జ్యూట్‌మిల్లు వంతెన వద్ద నుంచి పడమర లాకుల మీదుగా వట్లూరు వరకూ సుమారు ఎనిమిది కిలోమీటర్ల పొడవున కృష్ణకాలువలో నీటి నిల్వలున్నాయి. కాలువ వెంబడి రోజూ 15 నుంచి 20 ట్యాంకర్లు ఒక్కో ట్యాంకరు రోజుకు పది ట్రిప్పులు చొప్పున నీటిని తోడుకెళ్తున్నాయి. ఏలూరు పరిసర గ్రామాలైన గోపన్నపాలెం, గాలాయగూడెం తదితర ప్రాంతాలకు చెందిన వారుసైతం ఈ ట్యాంకర్లు కొనుగోలు చేసి నీటి వ్యాపారానికి పాల్పడుతున్నారు. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ నీటిని మోటార్లు పెట్టి తోడుకెళ్తున్నారు. ఒక్కో ట్యాంకర్ నీటిని దూరాన్ని బట్టి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు 200 ట్యాంకర్ల నీటిని తోడుకెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు కనీసం స్పందించడం లేదు.. కాలువలో నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్యాంకర్ల యజమానులను ఆయన హెచ్చరించారు.కృష్ణకాలువలో ఆ నీటి జాడలను కొందరు గుర్తించారు. ఈ నీటిని పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్న వారికి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీని కోసం కొందరు ఏకంగా కొత్తకొత్త ట్యాంకర్లు సైతం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా భవన నిర్మాణాలు ఎక్కువగా వేసవిలోనే చేపడతారు. ఈ తరుణంలో నిర్మాణాలు తడిపేందుకు ఎక్కువగా నీటి అవసరం ఉంటుంది. దీన్ని అవకాశంగా చేసుకుని ఏలూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో నిర్మిస్తున్న భవన, ఇతర నిర్మాణదారులకు నీటిని సరఫరా చేసేందుకు ఈ ట్యాంకర్ల యజమానులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.