YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మత్స్య కారులకు భరోసా

మత్స్య కారులకు భరోసా

ఏలూరు,
 సముద్రంలో వేట సాగించే మత్స్యకారులకు వేట నిషేధభృతిని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అందజేయనుంది. నేరుగా మత్స్యకారుల ఖాతాల్లో సొమ్ము జమకానుంది. వేట నిషేధం కారణంగా ఉపాధి లేక ఇంట్లోనే ఉన్న మత్స్య కార్మికులు ఒక్కొక్కరికి రూ.10 వేల  చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. చేపల పునరుత్పత్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం సముద్రంలో వేటను ఏటా ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి జూన్‌ 15వ తేదీ వరకూ అమలు చేస్తుంది. ఈ 61 రోజులు మత్స్యకారులు ఖాళీగా ఉంటారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఏప్రిల్‌ 15వ తేదీకి 20 రోజుల ముందే వేట బంద్‌ చేశారు. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం వేట నిషేధ సాయాన్ని ముందుగానే ఇస్తుంది. నిజానికి వేట నిషేధ భృతిని మళ్లీ తిరిగి వేట ప్రారంభమయ్యేనాటికి అందించేవారు. 19 కి.మీ. తీరప్రాంతం ఉంది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సముద్రంలో బోట్లపై వేట సాగించేవారు 1112 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.1.11 కోట్లు అందించనున్నారు. ఆధార్‌ నెంబర్లు, సాంకేతిక ఇబ్బందుల కారణంగా 20 మందికి బుధవారం సొమ్ము జమకావడంలేదని, మిగతా అందరికీ జమ అవుతుందని నరసాపురం మత్స్యశాఖ అధికారి ఏడుకొండలు చెప్పారు. ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది. గత ఏడాది 990 మందిని మత్స్యకార భరోసా పథకానికి ఎంపిక చేశారు.  గత ఏడాది నవంబర్‌ 21న జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార భరోసా పథకాన్ని అమల్లోకి తెచ్చారు. టీడీపీ హయాంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.4 వేలు ఇచ్చేవారు. అదీ కేవలం 300 మందికి మాత్రమే. సముద్రంలో వేట సాగిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందితే కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. బోటు యజమానులకు కూడా మేలు చేసింది. వేట బోట్లకు డీజిల్‌ రాయితీని లీటర్‌కు రూ.9కు పెంచారు. ఇంతకు ముందు రూ.6.03 మాత్రమే ఇచ్చేవారు. నెలకు 300 లీటర్ల చొప్పున 10 నెలలకు 3 వేల లీటర్ల డీజిల్‌కు సబ్సిడీ ఇస్తున్నారు.  

Related Posts