బాధితులకు మెరుగైన చికిత్స
ముఖ్యమంత్రి జగన్ ఆదేశం
అమరావతి
విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున సంభవించిన గ్యాస్ లీక్ దుర్ఘటనపై సీఎం జగన్మోహన్రెడ్డి స్పందించారు. జిల్లా కలెక్టర్ వినయ్చంద్, కమిషనర్ ఆర్కే మీనాతో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు సరైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు.
ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించాలరు.రెండు వందల మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కంపెనీకి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆసుప్రతిపాలు కావడంపై ఆవేదన చెందారు. ఆర్ ఆర్ వెంకటాపురంలో దుర్ఘటన బాధాకరం. మనుషులే కాదు మూగజీవాలు మృతిచెందాయి. కొనఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలి. చెట్లన్నీ రంగుమారడం విషవాయు తీవ్రతకు నిదర్శనం. యుద్దప్రాతిపదికన ప్రజలందరినీ ఖాళీ చేయించాలి. గ్యాస్ లీకై ఊళ్లు ఖాళీ చేయాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.