75 శాతం పెంచిన మందుకు తగ్గని డిమాండ్
మెదక్, మే 7
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపుల్లో ఆ బ్కారీశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. లాక్డౌన్ కంటే ముందు, ప్రస్తుత మందు నిల్వలపై వివరాలు సేకరించారు. మార్చి 22వ తేదీ వరకు ఉన్న మద్యం దుకాణాల్లో ఉన్న నిల్వలు , రికార్డులు, ప్రస్తుతం ఉన్న స్టాక్ తో సరిపోల్చి పరిశీలన చేస్తున్నారు. స్టాక్లో తేడాలు వస్తుండటంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మ ద్యం నిల్వల స్టాక్పై ఏం నివేదిక త యారు చేస్తామంటూ తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే కొన్ని వైన్ షాపులలో మద్యం ఖాళీ చేశారని ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు మన తెలంగాణకు చెప్పారు. ఇందులో మద్యం వ్యాపారులు , స్థానిక రాజకీయ నాయకులు , ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలోనే బ్లాక్ మార్కెట్కు అక్రమ మద్యం అమ్మారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఎక్సైజ్ కమిషనర్లకు వందలాది ఫిర్యాదులు అందాయి. కొన్నిచోట్ల మద్యం దొంగలు వైన్షాపులలో మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని షాపుల్లో అసలు మద్యం బాటిళ్లు లేకపోవడం గమనార్హం.వైన్షాప్ మొత్తం ఖాళీ అయినట్లు కూడా అధికారులు గుర్తించారు. మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు మద్యం ధరలను విపరీతంగా పెంచి విక్రయిస్తున్నారు. ఈ నెల 4న సరిహద్దు రాష్ట్రామైన ఎపిలో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబులు బారులు తీరి మరీ లిక్కర్ కొనుగోలు చేశారు. దీంతో ఎపి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ధరలను 75 శాతం పెంచింది. ఒక్క బీరు ఖరీదు రూ.400లకు చేరింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా మద్యం ధరలు బారీగా పెంచింది. పక్క రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కావడంతో రాష్ట్రంలోనూ విక్రయాలు జరపాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అందులో భాగంగానే మద్యం షాపులకు అనుమతులు మంజూరు చేస్తే , మద్యం ప్రియులు ఒక్కసారిగా జనసంద్రంగా మారితే పరిస్థితి ఏమిటని , స్టాక్ ఎలా ఉందని , సరిపడా ఉన్నాయా అనే కోణంలోనే ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేపట్టింది.ఇక ఎపిలో మద్యం షాపులు ఒక్కసారిగా తెరవడంతో జనాలు ఒక్కసారిగా రావడం , భౌతిక దూరం పాటించక పోవడం , మాస్కులు దరించకపోవడం , శానిటైజర్లను ఉపయోగించక పోవడంతో తెలంగాణలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ విక్రయాలు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మద్యం దుకాణాలలో స్టాక్ లెక్కలు సరితుగకపోతే బాధ్యులపై కుడా చర్యలు తప్పవని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు మద్యం దుకాణాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు రూ.1200 కోట్ల నుంచి రూ.1400 కోట్ల ఆదాయం వస్తుంది. గత 42 రోజులుగా ఈ ఆదాయం ప్రభుత్వం కోల్పోయింది.