YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తెరపైకి పెయిడ్ క్వారంటైన్లు

తెరపైకి పెయిడ్ క్వారంటైన్లు

తెరపైకి పెయిడ్ క్వారంటైన్లు
న్యూఢిల్లీ, మే 7
దేశంలో ఏ రాష్ట్రం స్వయం ఆర్ధిక పరిపుష్టి సాధించి ముందుకు వెళుతున్న పరిస్థితి లేదు. కేంద్రం ఇచ్చే నిధులపైనే బండి లాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కరోనా కష్టకాలం. అయితే లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వేస్తున్న కరోనా పెనాల్టీలు అన్ని ఇన్నీకావు. అవి వలస కూలీల నుంచి చార్జీల వసూళ్ళు ఆయా రాష్ట్రాలు భరించాలి. విదేశాల్లో ఉన్న భారతీయులు వారి టికెట్స్ వారే చెల్లించుకోవాలి. ఇక విదేశాలనుంచి వచ్చే వీరందరినీ క్వారంటైన్ కు అయ్యే ఖర్చు ఆయా రాష్ట్రాలే చూసుకోవాలి. ఇలా తరలింపు వరకు ఏ నిర్ణయం ప్రకటించినా రాష్ట్రాల ఆర్ధిక స్థితులను పరిగణలోనికి తీసుకోకుండా మూలిగే నక్కపై మరింత బండను గురిచూసి కేంద్రం పడవేయడం తీవ్ర విమర్శలకు తెరతీస్తోంది.ప్రపంచ మహమ్మారి కరోనా విజృంభణ తరువాత అన్ని దేశాలు ఆర్ధికంగా తీసుకున్న నిర్ణయాలు, భారత్ తీసుకున్న నిర్ణయాలకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. అయితే ప్రకటనల్లో కానీ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రసంగాల్లో మోడీ సర్కార్ ప్రపంచ నెంబర్ వన్ గా కొనసాగుతుంది కానీ. రాష్ట్రాలను ఉదారంగా ఆదుకునే సహృదయాన్ని చూపించలేకపోవడం విమర్శలకు దారి తీస్తుంది. ఇప్పటికే వలసకూలీలపై జాలి చూపని విధంగానే విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులు, ఉద్యోగులపై అదే తీరు చూపిస్తుంది కేంద్రం ప్రభుత్వం.అయితే కేంద్ర ప్రభుత్వం తాము భరించమని స్పష్టం చేస్తూ రాష్ట్రాలను మాత్రం క్వారంటైన్ వంటి ఖర్చులు భరించాలని ఆదేశించడాన్ని ఎలా చూడాలి. దీనిపై రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పెయిడ్ క్వారంటైన్ లో వారు ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా ప్రవాస భారతీయులకు షాక్ ఇచ్చే అంశమే. జన్మభూమికి తిరిగి రావడానికి ఇప్పటికే నెలల తరబడి వేచి చూస్తూ విదేశాల్లో నానా అగచాట్లు పడుతుంటే ఇండియా లో కూడా ఖర్చు అయిపోవాలిసిందేనా అన్నది వారి ఆవేదన.

Related Posts