విశాఖఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ 8 మండి మృతి
3 నుంచి 7 కిలోమీటర్ల మేర వ్యాపించిన కెమికల్ గ్యాస్
దాదాపు 200 మందికి పైగా అస్వస్థత
సురక్షిత ప్రాంతాలకు 20 వేల మంది తరలింపు
విశాఖపట్నం మే 7,
విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారు జామున గంటల సమయంలో పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు దాదాపు ఒక్కసారిగా 3 నుంచి 7 కిలోమీటర్ల మేర కెమికల్ గ్యాస్ వ్యాపించింది. కాగా లీకైన రసాయన గాలి పీల్చడంతో అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ నాయుడు తోట పరిసరాల్లో ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు. కాగా రసాయన గాలి పీల్చడంతో కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపైనే పడిపోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు లాక్‌డౌన్‌లో ఉన్న ఈ కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తుంది. అయితే గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాటు గ్యాస్ లీకేజీపై పోలీసులకు సమాచారమందించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. సురక్షిత ప్రాంతాలకు 20 వేల మందిని తరలించారు.కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. వారిలో ఇద్దరు వృద్దులు, ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. మరోవైపు విషవాయువు ప్రభావంతో వెంకటాపురంలో బావిలో పడి గంగరాజు అనే వ్యక్తి మృతిచెందగా, మేడపై నుంచి పడి మరోకరు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిశ్రమ నుంచి స్టెరీన్ అనే గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ గ్యాస్ వల్ల తొలుతగా తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్ళు మంటలు వస్తాయి. ఇదే గ్యాస్‌ను ఎక్కువగా పీలిస్తే క్యాన్సర్, కిడ్నీ వంటి వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. అయితే గతంలో కూడా ఈ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్‌లీక్ వచ్చినప్పటికీ కంపెనీ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై వాటిని అరికట్టే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.