ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా ముస్తఫా ఖాద్మీని
బాగ్ధాద్ మే 7
ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా ఆ దేశ ఇంటెలిజెన్స్ మాజీ అధిపతి ముస్తఫా ఖాద్మీని గురువారం పార్లమెంటు ఎన్నుకుంది. అమెరికా దేశ మద్ధతుదారు అయిన ముస్తఫా ఖాద్మీ గతంలో ఇరాక్ దేశ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. వేలాది మంది ఇరాకీలు తమకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ గతంలో ఇరాక్ పాలకులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. దీంతో అబ్దుల్ మహదీ నవంబరులో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇరాక్ దేశ భద్రత, స్థిరత్వం, వికాసానికి తాను పనిచేస్తానని ఇరాక్ కొత్త ప్రధాని ముస్తఫా ఖాద్మీ ట్వీట్ చేశారు. ఇరాక్ దేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్ పై పోరాటానికి తాను ప్రాధాన్యమిస్తామని కొత్త ప్రధాని ముస్తఫా ప్రకటించారు.