కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
-ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించడం తో పాటు సామాజిక దూరం పాటించాలి -నో మాస్క్ నో సేల -షాపు ముందు శానిటైజర్ పెట్టాలి
-జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ
నిర్మల్, మే 7,
కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, పోలీసు, వైద్య, రెవెన్యూ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్య, పోలీస్, మున్సిపాలిటీ, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేశాయని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మే 29 వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపు లు ఇస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న షాపులకు నెంబర్లను కేటాయించాలన్నారు. ఒక షాప్ కు 1 నెంబరు ప్రక్కన షాప్ కు 2 నెంబర్ ను వేసి 1 నెంబరు ఉన్న షాపు లను ఒకరోజు ఓపెన్ చేయాలని, 2నెంబర్ ఉన్న షాపులను రెండవ రోజు తెరవాలని (50 శాతం షాపులు మాత్రమే ఓపెన్ ఉండేలా చూడాలని) మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకు పనిచేసేలా చూడాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ను ఆదేశించారు. అవసరమైన వస్తువులు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇతర అన్ని సేవలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయన్నారు. నిత్యవసర సరుకులు, వస్తువులు, పండ్లు, పాలు, కూరగాయలు, మెడికల్, నర్సరీ ఉత్పత్తులు తెరిచి ఉంటాయన్నారు. నిర్మాణానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చని, మెటీరియల్, సిమెంటు స్టీల్, హార్డ్వేర్,ప్లంబర్, ఎలక్ట్రికల్ పరికరాల దుకాణాలు తెరిచి ఉంటాయని, వ్యవసాయ సంబంధమైన యంత్రాలు, విడి భాగాల దుకాణాలు, ఎరువులు, విత్తనాల దుకాణాలు తెరచి ఉంటాయన్నారు. వైన్ షాపులు ప్రతిరోజు తెరిచి ఉంటాయని తెలిపారు. అన్ని రకాల షాపుల వద్ద సామాజిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని,శానిటైజర్ లను ఉంచాలని ఆదేశించారు. నో మాస్క్ నో సేల్(మాస్క్ లు ధరించకపోతే వస్తువులు ఇవ్వబడదు) అని తెలపాలన్నారు. కరోనా నియంత్రణ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు అధికారులు సిబ్బంది కార్యాలయాలలో పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బంది మాస్కులు ధరించేలా చూడాలన్నారు. జలుబు జ్వరం దగ్గు ఉన్నవారిని గుర్తించాలన్నారు. కార్యాలయాల ప్రవేశ మార్గం ద్వారా వద్ద శానిటైజర్ లను ఉంచాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, అదనపు కలెక్టర్ కె భాస్కర్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వసంత్ రావ్, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి, ఆర్ డి ఓ లు రాజు, ప్రసూనాం, ఏల్.డి.యం. హరికృష్ణ, డిఎస్పీ ఉపేందర్రెడ్డి మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.