కామారెడ్డి జిల్లాలో 8303 వాహనాలు సీజ్
ఎస్పీ శ్వేత రెడ్డి
కామారెడ్డి మే 7
కరోన వ్యాధి బారిన పడకుండా ప్రజా క్షేమం కోరుతూ లాక్ డౌన్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నియమ నిబంధనలు పాటించకుండా చట్టాలను అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి తెలిపారు. బుధవారం నాటికి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 8303 వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు కాగా ఇందులో 8040 ద్విచక్ర వాహనాలు 112 ఆటోలు 151 ఫోర్ వీలర్స్ ఉన్నట్టు చెప్పారు. లాక్ డౌన్ ను ఈ నెల 29 వరకు పొడిగించిన నందున జిల్లా ప్రజలు సహకరించాలని అనవసరంగా రోడ్లపై తిరిగితే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి అని హెచ్చరించారు, భౌతిక దూరం పాటించాలి అని చెప్పారు.