విషాద దుర్ఘటనలో వైద్య విద్యార్థి మృతి
విశాఖపట్నం మే 7,
విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన ఎందరికో కన్నీళ్లను మిగిల్చింది. పచ్చని పరిసరాలను విషతుల్యంగా మార్చేసింది. ఈ దుర్ఘటనలో విషవాయువు పీల్చిని వైద్య విద్యార్థి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయాడు. చంద్రమౌళి ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గత సంవత్సరం మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో మెరిట్ ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటును దక్కించుకున్న టాలెంటెడ్ విద్యార్థి. భవిష్యత్తులో తమ కుమారుడు డాక్టరై ప్రజల ప్రాణాలు కాపాడతాడని తల్లిదండ్రులు ఆశిస్తే.. ఇంతలోనే విషవాయువు భావి డాక్టర్ ప్రాణాలు తీసుకుంది. మరోవైపు, గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. రసాయనక గ్యాస్ భారీగా లీక్ అవ్వడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మరణించిన వారి వివరాలుః కుందన శ్రేయ (6), ఎన్. గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగ రాజు (48), మేకా కృష్ణమూర్తి (73)తోపాటు మరో ఇద్దరు మరణించారు.