YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్ విదేశీయం

ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. కోటి ఆర్థిక సాయం

ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. కోటి ఆర్థిక సాయం

ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. కోటి ఆర్థిక సాయం
విశాఖ ఘటన దురదృష్టకరం  వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు సాయం
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.1 లక్ష సాయం అందరూ కోలుకునే వరకు ఉచిత వైద్యం ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు..
విశాఖపట్నం మే 7
విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చెప్పారు. కేజీహెచ్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరంం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ లీకేజీ సంఘటన  చాలా బాధాకరమని ఆయన అన్నారు. స్వల్పంగా అస్వస్థతకు గురైన వారికి పాతిక వేలు, రెండు రోజులకు పైగా ఆసుపత్రిలో  చికిత్స పొందిన వారికి పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధితుల చికిత్స కయ్యే వ్యయం మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రభావిత గ్రామాలలోని ప్రజలందరికీ పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని జగన్ చెప్పారు. గ్యాస్ లీకేజీ గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  బాధితులకు ఆర్థికసాయం అందిస్తాం:సీఎం జగన్‌ అన్ని విధాలు గా మీకు న్యాయం జరుగుతుంది హామీ నాది..  సీఎం జగన్..ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో లీకైన గ్యాస్‌ ప్రభావం కొన్ని రోజులపాటు ఉంటుందని ఏపీ సీఎం జగన్‌ తెలిపారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలోని వెంకటాపురం, ఎస్సీ, ఎస్సీ కాలనీ, నందమూరి నగర్‌, పద్మనాభపురంలో ఈ గ్యాస్‌ లీక్‌ ప్రభావం ఉందని చెప్పారు. రెండు, మూడు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందే వారికి రూ. లక్ష, స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ. 25వేలు , పశువులు నష్టపోయిన వారికి రూ. 20వేలు చొప్పున సాయం చేస్తామని తెలిపారు. ప్రభావిత గ్రామాల ప్రజలకు రూ.10వేలు చొప్పున సాయమందిస్తామన్నారు. సుమారు 15వేల మందికి ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు

Related Posts