నిరంతర సేవలో రెడ్ క్రాస్ సొసైటీ
ఆదిలాబాద్ మే 07
జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిరంతర సేవా కార్యక్రమాలు చేపట్టాడం జరుగుతుందని రెడ్ క్రాస్ సొసైటీ చెర్మన్ గాంగేశాశ్వర్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని తిరుపెళ్లి లో వలస వచ్చి ఇక్కడే ఉంటున్న 50 కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చెయ్యడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కొవిడ్ (19) కారోనా వైరస్ విజృంభించిన తరుణంలో పేద ప్రజలు వలస కూలీలకు నిత్యావసర వస్తువులను అందించామన్నారు. విపత్తు సమయంలో మా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ ఎంసి మెంబర్ విజయ్ బాబు,లోకండే అనిల్ ,దినేష్,మన్నూర్ ఉప సర్పచ్ జగన్ బొడికే,బేలా మండల్ కొర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి,రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.