గుజరాత్ నుంచి విశాఖకు స్టెరిన్‌కు విరుగుడు: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ మే 7
విశాఖపట్టణం గ్యాస్ లీకేజ్ ప్రమాదంపై తీసుకుంటున్న చర్యలను కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. స్టెరిన్‌కు విరుగుడును గుజరాత్ నుంచి విశాఖకు తీసుకొస్తున్నామని తెలిపారు. స్టెరిన్‌ను పీటీబీసీ ద్వారా అరికట్టొచ్చని ఎల్జీ పాలీమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తమతో చెప్పారని.. దీనిపై హోంమంత్రి అమిత్ షాతో చర్చించామని ఆయన అన్నారు. గుజరాత్‌లోని వ్యాపిలో అది లభ్యమవుతుందని.. అక్కడి నుంచి డామన్ ఎయిర్ పోర్టు... అక్కడి నుంచి విశాఖకు తీసుకొస్తున్నామన్నారు. అలాగే పూణే నుంచి కెమికల్ నిపుణులను రప్పిస్తున్నామన్నారు.టీబీసీని 4 టెర్ట్-బ్యూటీల్‌కేటెకాల్ అంటారు. స్టెరిన్, బూటాడిన్, వినైల్ అసిటేట్ లాంటి ప్రమాదకర వాయువులకు విరుగుడుగా ఇది ఉపయోగపడుతోంది.