YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వార్తలు కాదు...ప్రాణాలు ముఖ్యం -మంత్రి శ్రీనివాస్ గౌడ్

వార్తలు కాదు...ప్రాణాలు ముఖ్యం -మంత్రి శ్రీనివాస్ గౌడ్

వార్తలు కాదు...ప్రాణాలు ముఖ్యం
-మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ మే 07 (
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎవరినైనా కాటు వేసే ప్రమాదం ఉందని, ఈ విపత్తులో విధి నిర్వహణలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వార్తల కవరేజి ఆత్రుతతో ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ లో గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె)ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  సమాజానికి మీ సేవలు ఎంతో అవసరం.. అలాగే మీ కుటుంబాలు ఎన్నో ఆశలతో మీపై ఆధారపడి ఉన్నాయి... ప్రాణం కన్నా ముఖ్యమైందేమి లేదు...ఇందుకుగానూ విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని జర్నలిస్టులకు మంత్రి సూచించారు. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ సత్ఫలితాలు సాధిస్తుందన్నారు. కరోనా విపత్తు నుండి బయట పడిన వెంటనే మహబూబ్ నగర్ లో జర్నలిస్ట్స్ కాలనీ నిర్మాణపు పనులను ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న టీయూడబ్ల్యుజె-ఐజేయూ నాయకత్వాన్ని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. టీయూడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ కరోనా విపత్తు మూలంగా మీడియా  రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడంతో జర్నలిస్టులు దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టి వేయబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను ఆదుకోడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజె రాష్ట్ర కార్యదర్శి పేపర్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఏ.రాజేష్, వెంకటేశ్వర రావు, శిగ శంకర్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా శాఖ అధ్యక్షులు దత్తేంద్ర, జిల్లా కార్యదర్శి శేఖర్, జిల్లా నాయకులు బి.జి.రామాంజనేయులు, రవి కుమార్, మధు, వెంకటేష్, నరేంద్ర చారీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts