YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ గ్యాస్‌ లీక్‌పై స్పందించిన ఏపీ హైకోర్టు

విశాఖ గ్యాస్‌ లీక్‌పై స్పందించిన ఏపీ హైకోర్టు

విశాఖ గ్యాస్‌ లీక్‌పై స్పందించిన ఏపీ హైకోర్టు
అమరావతి మే 07
విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఏపీ హైకోర్టు స్పందించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా హైకోర్టు స్వీకరించింది. ఈ ఘటనను సుమోటోటా స్వీకరించడం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. ఈ దుర్ఘటన ప్రజల ప్రాణాలతో కూడుకున్న నేపథ్యంలోనే సుమోటోగా స్వీకరించినట్లు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే జనావాసాల మధ్య అలాంటి పరిశ్రమ ఎలా ఉందని న్యాయస్థానం విచారణ సందర్భంలో అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని అమికస్‌ క్యూరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

Related Posts