YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

సాంకేతిక లోపంవల్లే గ్యాస్‌ లీక్ విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్

సాంకేతిక లోపంవల్లే గ్యాస్‌ లీక్ విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్

సాంకేతిక లోపంవల్లే గ్యాస్‌ లీక్
విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్
విశాఖ మే 07
గ్యాస్‌ లీకేజీ కారణంగా అస్వస్థతకు గురైన బాధితులను విశాఖ కేజీహెచ్‌లో పరామర్శించిన సీఎం జగన్‌ వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులు, అధికారులను ఆదేశించారు. అనంతరం కేజీహెచ్‌లోనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ గ్యాస్‌ వల్ల దీర్ఘకాలికంగా బాధితులు పడే ఇబ్బందులు, వారికి అందించాల్సిన చికిత్సా విధానంపై వైద్యులు సీఎంకు వివరించారు. అలాగే ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ప్రస్తుత పరిస్థితి, ఘటన జరిగిన తీరుపై విశాఖ కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ సీఎంకు తెలియజేశారు. ‘‘లీకైన రసాయనం ఎప్పుడూ ద్రవ రూపంలో, 20 డిగ్రీల ఉష్ణోగ్రత లోపే ఉండాలి. సంస్థలో తలెత్తిన సాంకేతిక లోపాలవల్లే రసాయనం వాయు రూపంలోకి మారింది. ఉదయం 3.45 గంటల నుంచి 5.45 గంటల మధ్య పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. లీకైన గ్యాస్‌ 1.5 కి.మీ. నుంచి 2 కి.మీ. వరకు ప్రభావం చూపించింది’’ అని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ సీఎంకు వివరించారు.
 

Related Posts