గత కొద్దిరోజులుగా సినీ పరిశ్రమ పై సంచలన వ్యాఖ్యాలు చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా హైదరాబాద్లోని ఫిల్మ్ చాంబర్ లో దగ్గర హల్ చల్ చేసింది. చాంబర్ ఆవరణలో అర్ధనగ్నంగా నిరసన చేసింది. సినిమాల్లో వేషాలివ్వడానికి పడక గదికి రావాల్సిందిగా కొందరు అన్నారని ఆమె వాదన. ఫిల్మ్ చాంబర్ కుడా తనకు అన్యాయం చేసిందని ఆమె ఈ శనివారం అక్కడే నిరసనకు దిగింది. అర్ధనగ్నంగా కూర్చుండిపోయింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి.. సీఎం కేసీఆర్ స్పందించకపోతే.. నడిరోడ్డుపై నగ్నంగా నిలబడుతానని అన్నది. ఇప్పుడు శ్రీరెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్లో కాక రేపుతున్నాయి. శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. 'కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే... నిరాహారదీక్ష చేస్తా. గతంలో మీరు పోరాడి, విజయం సాధించిన మార్గాన్నే నేను ఎంచుకున్నా. మీరు ఇప్పటికీ స్పందించకపోతే, పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు' అని ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తెలిపింది. కాగా తనకు టాలీవుడ్ లో ప్రముఖులు అన్యాయం చేసారని శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె అందోళన సంగతి తెలిసిన బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఆమె నివాసం ఉంటున్న ఇంటి వద్దకు శ్రీరెడ్డిని తీసుకువెళ్లి దింపారు.