YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఛత్తీస్ ఘడ్ లో గ్యాస్ లీక్

ఛత్తీస్ ఘడ్ లో గ్యాస్ లీక్

ఛత్తీస్ ఘడ్ లో గ్యాస్ లీక్
రాయ్ పూర్, మే 7
విశాఖలో గ్యాస్ లీకైన దుర్ఘటనలో 11 మంది మృతి చెందిన వార్తతో దేశవ్యాప్తంగా విషాదం అలుముకోగా.. అలాంటిదే మరో విషాదం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌గర్ జిల్లాలో ఓ పేపర్ మిల్లులో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గురువారం (మే 7) మధ్యాహ్నం మిల్లులోని ఓ ట్యాంకులో క్లీనింగ్ పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. లాక్‌డౌన్‌తో మూతబడ్డ పరిశ్రమలో తిరిగి పనులు ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌కు తరలించినట్లు రాయ్‌గర్ ఎస్పీ సంతోష్ సింగ్ తెలిపారు.ఘటన వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదని అధికారులు తెలిపారు. బాధితులను చేర్పించిన రాయ్‌గర్ ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నట్లు వెల్లడించారు. ఘటన తర్వాత కంపెనీ యజమాని అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు

Related Posts