YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఐదు కిలోమీటర్లలో టెన్షన్

ఐదు కిలోమీటర్లలో టెన్షన్

ఐదు కిలోమీటర్లలో టెన్షన్
విశాఖపట్టణం, మే 7
విశాఖపట్నంలో సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువుల కారణంగా చుట్టుపక్కల 5 కిలో మీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఫ్యాక్టరీ నుంచి లీకైన స్టెర్లిన్‌ గ్యాస్‌ బాగా ఘాటుగా ఉండటంతో.. కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది రోడ్లపైకి వచ్చి పడిపోవడంతో అక్కడి పరిస్థితి భయానకంగా మారిపోయింది. రాష్ట్రం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ గురించి తెలుసుకుందాం.హిందుస్తాన్‌ పాలిమర్స్‌ పేరుతో 1961లో ఈ కంపెనీ ప్రారంభించారు. 1978లో దీనిని యూబీ గ్రూప్‌ తీసుకుంది. 1997 జులైలో దక్షిణకొరియాకు చెందిన ఎల్‌జీ గ్రూప్‌(ఎల్‌జీ కెమికల్స్‌) తీసుకుని ఎల్‌జీ పాలిమర్స్‌గా మార్చింది. థర్మాకోల్‌ లాంటివి ఇందులో తయారు చేస్తారు. లాక్‌డౌన్‌ మినహాయింపుల్లో పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో దీనిని తిరిగి ప్రారంభించారు. ప్రారంభించిన ఒక్క రోజులోనే ఈ గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగింది.

Related Posts