కార్మికులపై చర్యలు
విశాఖపట్టణం, మే 7
విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ అవ్వడానికి కారణాలను అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే గ్యాస్ లీకయిందని పేర్కొన్నారు. ఈ కంపెనీ నంచి లీకయింది స్టిరీన్ గ్యాస్ గా అధికారులు గుర్తించారు. ఈ గ్యాస్ గాలిలో త్వరగా కలసిపోతుంది. లాక్ డౌన్ కారణంగా మెయిన్ టెయినెన్స్ లేక పోవడమే. మెయిన్ టెయినెన్స్ చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలోనూ 45 మంది సిబ్బందికి ప్రత్యేక పాస్ లుకూడా ఇచ్చింది. కానీ యాజమాన్యం మెయిన్ టెయినెన్స్ పట్టంచుకోలేదు. పరిశ్రమలోని ట్యాంకుల్లో దాదాపు రెండువేల టన్నుల స్టెరిన్ గ్యాస్ నిల్వ ఉంది. అక్కడ ఇరవై డిగ్రీల ఉష్టోగ్రత లోపే ఉంచాలి. కానీ ఆ ఉష్ణోగ్రత ను పరిశ్రమ యాజమాన్యం మెయిన్ టెయిన్ చేయలేదు. ఉష్ణోగ్రత పెరగడంతోనే గ్యాస్ లీకయిందని అధికారులు తన ప్రాధమిక విచారణలో గుర్తించారు