YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఎల్జీ కంపెనీదే బాధ్యత

ఎల్జీ కంపెనీదే బాధ్యత

ఎల్జీ కంపెనీదే బాధ్యత
విజయవాడ, మే 7
విశాఖపట్నం ఆర్ఆర్ వెంటకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ దుర్ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్‌జీ కంపెనీ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఎల్‌జీ కంపెనీ ప్రభుత్వం అనుమతి తీసుకుని పున:ప్రారంభించారన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల రీ ఓపెనింగ్‌కు చేయాల్సినంత చేసిందన్నారు. ప్రభుత్వం ఇంత చేసినప్పుడు ఎల్జీ వంటి పెద్ద కంపెనీలు మరింత బాధ్యతగా మెలగాల్సి ఉందని చెప్పారు.అయితే ఎల్‌జీ కంపెనీ యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే గ్యాస్ లీకై ప్రమాదం సంభవించిందని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనలో చిన్న పిల్లలు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఈ ప్రమాదానికి కంపెనీ యాజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయినట్లు సమాచారం వచ్చిందని, అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మంత్రి గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, బాధితులంతా విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

Related Posts