YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

విషాక్..పట్టణం

విషాక్..పట్టణం

విషాక్..పట్టణం
విశాఖపట్టణం, మే 8,
విశాఖపట్నం ప్రశాంత నగరం. ప్రతీ ఒక్కరూ జీవితంలో ఒక్కసారి అయినా విశాఖ రావాలనుకుంటారు. అందమైన గమ్యస్థానంగా భావిస్తారు. అటువంటి విశాఖకు ప్రక్రుతి ఎంతటి వరమో అంతటి శాపం. తరచూ తుఫాన్లు విశాఖను పీడిస్తూ ఉంటాయి. 2014 లో హుదూద్ తుఫాన్ విశాహను వణికించిన తీరు అందరికీ తెలుసు. ఆనాడు చిగురుటాకులా నగరం వణికిపోయింది. సాదాగా కనిపించే సాగర గర్భంలో ఉవ్వెత్తిన అలలు విశాఖను అతలాకుతలం చేశాయి. విశాఖ హుదూద్ బాధల నుంచి కోలుకునేసరికి అక్షరాలా రెండేళ్ల వ్యవధి పట్టింది.విశాఖ ఆసియా ఖండంలో శరవేగంగా అభివృధ్ధి చెందిన నగరంగా చెబుతారు. మెట్రో సిటీగా కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రగతి సాధించడానికి ప్రభుత్వ ప్రైవేటు రంగంలో వెల్లువలా ఏర్పాటైన పరిశ్రమలు. దాంతో ఉపాధి కోసం విశాఖకు వచ్చేవారితో ఈ నగరం ఎంతో ఎత్తుకు ఎదిగింది. అయితే ఇపుడు పరిశ్రమలే పచ్చని విశాఖకు చిచ్చు పెడుతున్నాయి. కాలుష్యపు కోరల్లో నగరం చిక్కుకుని విలవిలలాడుతోంది. విశాఖలో తరచూ పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలు అణుబాంబులనే పేలుస్తున్నాయి.ఇక విశాఖలో ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న హెచ్ పీ సీ ఎల్ లో 1997లో సెప్టెంబర్ నెలలో భారీ పేలుడు సంభవించింది. ఆనాడు కూడా పరిశ్రమలో గాస్ లీక్ అయి భారీ పేలుడుతో చాలామంది చనిపోయారు. ఆ తరువాత తరచూ హెచ్ పీ సీ ఎల్ లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హెచ్ పీ సీ ఎల్ విశాఖ నగరం మధ్యలోనే ఉంది. అలాగే అనేక ప్రమాదకరమైన పరిశ్రమలు కూడా నగరాన్ని ఆనుకునే ఉన్నాయి.విశాఖ నగరానికి తూర్పు ముఖంగా సముద్రం ఉంది. ప్రకృతి విపత్తులకు ఎపుడూ ఆలవాలంగా ఉంటుంది. ఇకి నగరానికి పడమర వైపు చూస్తే వరసగా భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ ప్రమాదకరమైనవే కావడం విశేషం, ప్రభుత్వ సెక్టార్ సంగతి పక్కన పెడితే ప్రైవేట్ రంగంలోని పరిశ్రమలల్లో నిర్వహణ లోపంతో పాటు నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తోంది. ఇపుడు నగరానికి అన్ని వైపులా భయాలు పెరిగిపోతున్నాయి. సుందరమైన నగరానికి కాలుష్యం పెద్ద బాధ అనుకుంటే ఇపుడు ఆపదలు ముంచుకొస్తున్నాయి. మొత్తానికి విశాఖ వణుకుతోంది.25 జిల్లాలు దిశగా ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ సర్కార్ అడుగులు వేస్తుంది. రాజధాని ని మూడు భాగాలుగా చేయడంలో ఇందులో భాగమే. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా చేస్తామని ఏపీ లో 25 జిల్లాలను చేస్తామని కూడా ప్రకటించింది కూడా. అయితే కొత్త ప్రభుత్వంగా వైసీపీ కొలువైన తరువాత అమరావతి వివాదాలతోనే సమయం సరిపోయింది. ఆ తరువాత కరోనా ప్రభావంతో ఈ ఆలోచనలు అన్ని జాప్యం అవుతూ వస్తున్నాయి. తాజాగా ప్రతి జిల్లాకు అదనంగా మరో ఐఏఎస్ ను నియమిస్తూ వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వారికి కొన్ని ప్రత్యేక బాధ్యతలు కేటాయించింది. ఇది గమనిస్తే రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంట్ స్థానానికి ఒక్కో జిల్లాగా చేసేందుకే ఇప్పటినుంచి సర్కార్ కసరత్తు చేస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మూడు రాజధానుల అంశం ఒక కొలిక్కి వచ్చాకా మరో అడుగుగా జిల్లాల పెంపు చేయాలని వైసీపీ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే తెలంగాణ లో విభజన తరువాత కేసీఆర్ పది పాత జిల్లాల స్థానంలో 33 గా మార్చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఈ ఆలోచన ఇంకా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఇప్పుడు ఐఏఎస్ లను అదనంగా జిల్లాల వారి నియమించడంతో త్వరలో జగన్ సర్కార్ తాను గతంలో చెప్పింది అమలు చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. అందుకోసమే వైసీపీ సర్కార్ ముందస్తు చర్యలను ప్రారంభించిందంటున్నారు.

Related Posts