YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ ను ఎత్తేస్తున్న సోషల్ మీడియా

జగన్ ను ఎత్తేస్తున్న సోషల్ మీడియా

జగన్ ను ఎత్తేస్తున్న సోషల్ మీడియా
విజయవాడ, మే 8
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ముఖ్యమంత్రిగా అనుభవం లేకపోవచ్చు. కానీ ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలను దగ్గర నుంచి చూశారు. అదే ఆయనకు ఇప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలు, ప్రజల అవసరాలను తేలిగ్గా గుర్తించగలుగుతున్నారు. గత కొంతకాలంగా కరోనా వైరస్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవస్థలు పడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. కానీ వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలోనే ఉంటూ నిత్యం సమీక్షలు చేస్తున్నారు.తాజాగా విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించింది. భోపాల్ గ్యాస్ లీకు తర్వాత అతి పెద్ద సంఘటనగా నిపుణులు సయితం దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ చాటుకున్న ఉదారతపై పార్టీల కతీతంగా ప్రశంసలు కురుస్తున్నాయి. గ్యాస్ లీక్ సంఘటనలో మృతి చెందిన కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రకటించడం చరిత్రలో ఎక్కడా జరగలేదంటున్నారు. నిజానికి ఈ ప్రకటన విపక్షాలు సయితం ఊహించనదే.గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వెంటనే స్పందించి హుటాహుటిన విశాఖకు చేరుకున్నారు. జరిగిన సంఘటన బాధాకరమే అయినప్పటికీ ఆయన మృతుల కుటుంబాలకు మాత్రమే కాకుండా గ్యాస్ లీక్ తో ఇబ్బంది పడిన వారందరికీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రెండు రోజులు ఆసుపత్రిలో ఉంటే లక్ష రూపాయలు, వెంటిలేటర్ పై చికిత్స పొందే వారికి పది లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించడం నిజంగా సంచలనమే. ఎవరూ ఊహించనిదే. కానీ జగన్ ఏమాత్రం వెరవకుండా ఇంత పెద్దయెత్తున ఆర్థికసాయాన్ని ప్రకటించడంపై సోషల్ మీడియాలో సయితం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.భారతీయ జనతా పార్టీ సయితం జగన్ ప్రకటనను స్వాగతించింది. కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు కూడా జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఇది సామాన్య విషయం కాదని ఆయన తెలిపారు. అక్కడికక్కడే ఎక్స్ గ్రేషియోని కోటి రూపాయలు ప్రకటించడం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని కూడా ఆయన గుర్తు చేశారు. జగన్ డబ్బుకు వెనకాడలేదు. బాధితుల కోణంలోనే చూశారు. అందుకే ఆయన మనసున్న మారాజు అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి జగన్ పెద్ద ప్రమాదమయినా దానికి స్పందించిన తీరుతో సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు.

Related Posts