YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రెట్టింపు ధరలతో మద్యం షాక్

రెట్టింపు ధరలతో మద్యం షాక్

రెట్టింపు ధరలతో మద్యం షాక్
విజయవాడ, మే 8,
మద్యం బాటిల్ ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తా. దశలవారీగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తాం. ఇది వైఎస్ జగన్ గత ఎన్నికలముందు వైసిపి మ్యానిఫెస్టో లో పెట్టడం, పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీ. అయితే వైసిపి అధికారంలోకి వచ్చాకా మద్యపాన వినియోగం ఏపీ లో తగ్గింది ఏమీ లేదు. ఈ దశలో మద్యం షాపులను ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చింది. బెల్ట్ షాపులు రద్దు చేశారు. కొంతవరకు ఇది ప్రజామోదం పొందింది. అంతా బాగానే ఉంది. అనుకున్నట్లే మద్యం ధరలు పెంచింది వైసిపి ప్రభుత్వం. ఇక్కడివరకు బాగానే ఉంది.కరోనా మహమ్మారి మొదలైంది. మద్యం ప్రియులకు చుక్కలేకుండా లాక్ డౌన్ అడ్డుకుంది. మూడో దఫా కేంద్రం మద్యం అమ్మకాలపై మార్గదర్శకత్వాలను విడుదల చేసింది. మద్యం ప్రియులకు శుభవార్త లభించింది. ఎపి సర్కార్ షాపులను అన్ని రాష్ట్రాల్లాగే మొదలు పెట్టింది. అదీ 25 శాతం పెంచి ఓపెన్ చేసింది. అయితే షాపు లు ఇలా ఓపెన్ అయ్యాయో లేదో మందు బాబులు ఎగబడ్డారు. అదీ ఎంతలా అంటే ఈ షాపుల దగ్గర ఉండే వారిలో ఒక్క కరోనా పాజిటివ్ రోగి వున్నా సమాజం మొత్తం తగలబడే రీతిలో. దాంతో ఏపీ ప్రభుత్వంపై విమర్శల వాన తుఫాన్ లా చుట్టుముట్టింది.దీంతో పెంచిన 25 శాతానికి మరో 50 శాతం ధరలు పెంచేసింది ఎపి సర్కార్. అంతే కాదు 13 శాతం లిక్కర్ షాపులను మూయించింది. ఈ దెబ్బతో మందుబాబులపై పిడుగులు పడ్డాయి. చుక్కలు అంటిన ధరలతో చుక్క తాగక పోతే ఏమైపోతుంది లే అని నిరాశపడ్డాయి ఆ వర్గాలు. తొలి రెండు రోజులకు మూడో రోజుకు అమ్మకాల్లో 50 శాతానికి పైగా ఆదాయం పడిపోయింది అంటే సర్కార్ మధ్య నియంత్రణ చర్యలు సరైనవే అనేందుకు మద్దతు లభించింది. అయితే ఆకాశం అంటిన ధరల దెబ్బకు మందు బాబులు గుడుంబా వైపు మళ్లుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేదా జగన్ చెప్పినట్లే మద్యం అంటే విరక్తి మధుప్రియులకు కలిగిందా అన్నది రాబోయే కాలమే చెప్పనుంది.

Related Posts